Yash Toxic : యశ్ నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ కాదా? ఈ బాలీవుడ్ భామ వర్కౌట్ అవుతుందా?
యశ్ నెక్స్ట్ సినిమాని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకి ‘టాక్సిక్’ అనే ఆసక్తికర టైటిల్ ని ప్రకటించారు.

Yash 19th Movie Toxic Heroine update goes Viral no chance for Sai Pallavi
Yash Toxic : కన్నడ హీరో ‘యశ్’ కేజీఎఫ్(KGF) సినిమాలతో ఇండియా వైడ్ భారీ క్రేజ్ ని సంపాదించుకున్నారు. కేజీఎఫ్ 2 సినిమా 1250 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని భారీ విజయం సాధించింది. దీంతో అంతటి బ్లాక్ బస్టర్ తర్వాత యశ్ ఎలాంటి సినిమా చేస్తాడా అని అంతా సంవత్సరం పైనే ఎదురు చూశారు. మొత్తానికి ఇటీవలే కొన్ని రోజుల క్రితం యశ్ 19వ సినిమా అప్డేట్ ఇచ్చారు.
యశ్ నెక్స్ట్ సినిమాని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకి ‘టాక్సిక్’ అనే ఆసక్తికర టైటిల్ ని ప్రకటించారు. అలాగే 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కూడా చేస్తామని ప్రకటించేశారు చిత్రయూనిట్. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక టాక్సిక్ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. దీంతో అటు సాయి పల్లవి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : Ileana D’Cruz : భర్త గురించి మొదటిసారి మాట్లాడిన ఇలియానా.. బాబు పుట్టాక..
కానీ తాజా కన్నడ సినీ పరిశ్రమ సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ భామని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ని టాక్సిక్ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఆల్రెడీ కథ కూడా వినిపించారట. దీంతో ఈ సినిమాలో యశ్ పక్కన కరీనా కపూర్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ కరీనా యశ్ కంటే పెద్దది. చూడటానికి కూడా యశ పక్కన ఉన్నా పెద్దగానే కనిపిస్తుంది. మరి కరీనా యశ్ పక్కన హీరోయిన్ పాత్రకా? లేదా ఏదైనా ముఖ్య పాత్రకి సంప్రదించారా అని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.