Santosh Sobhan comments on Auditions in a Interview
Santosh Sobhan : సంతోష్ శోభన్, మాళవిక నాయర్(Malavika Nayar) జంటగా నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అన్నీ మంచి శకునములే'(Anni Manchi Shakunamule). స్వప్న సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే 18న థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ఎన్టీఆర్(NTR) ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన అనంతరం ఓ చక్కని ఫ్యామిలీ సినిమాలా అనిపించింది.
చిత్రయూనిట్ గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హీరో నాని, దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథులుగా రానున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా హీరో సంతోష్ శోభన్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Prabhas : ఆదిపురుష్ హిట్ అవ్వాలని.. భద్రాద్రి రాముడికి 10 లక్షల విరాళం ఇచ్చిన ప్రభాస్..
సంతోష్ శోభన్ ని ఈ సినిమాకు కూడా ఆడిషన్ ఇచ్చారంట, ఇన్ని సినిమాలు చేశాక కూడా ఆడిషన్ ఎందుకు అని అనిపించలేదా అంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగారు. సంతోష్ శోభన్ సమాధానమిస్తూ.. అలా నేనెప్పుడూ అనుకోను. ఆడిషన్ ఇస్తే తప్పేముంది. నన్ను ఏ సినిమాకు, ఎవరు స్క్రీన్ టెస్ట్ కు పిలిచినా కచ్చితంగా వెళ్తా. చాలా మంది నేను ఇన్ని ఆఫీసుల చుట్టూ అవకాశాల కోసం తిరిగాను, ఆడిషన్స్ ఇచ్చాను అని అవేదో కష్టాల్లాగా చెప్తారు. అవేం కష్టాలు కాదు, వాటిని కష్టాల్లాగా చూడకూడదు. మనం అంటే ఏంటో తెలియని వాళ్లకు మన గురించి చూపించడానికి ఆడిషన్ ఉపయోగపడుతుంది. దాన్ని తప్పుగా చూడొద్దు. ఆడిషన్ ద్వారే ఈ సినిమాలో నాకు ఛాన్స్ దొరికినందుకు నేను హ్యాపీగానే ఫీల్ అవుతానను అని అన్నారు.