Sapthagiri Pelli Kani Prasad Movie Review and Rating Here
Pelli Kani Prasad Movie Review : సప్తగిరి, ప్రియాంక జంటగా తెరకెక్కిన సినిమా ‘పెళ్లి కాని ప్రసాద్’. థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పణలో K.Y.బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మాణంలో అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వడ్లమాని శ్రీనివాస్, మురళీధర్ గౌడ్, ప్రమోదిని, రోహిణి.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. పెళ్లి కాని ప్రసాద్ సినిమా నేడు మార్చ్ 21న థియేటర్స్ లో విడుదల అయింది.
కథ విషయానికొస్తే.. ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలో ఓ స్టార్ హోటల్ లో పని చేస్తూ ఉంటాడు. కట్నం తీసుకోవాలి అనే వాళ్ళ నాన్న ఆశతో పెళ్లి అవ్వకుండా ఉంటాడు. 38 ఏళ్ల వయసులో కూడా ప్రసాద్ తండ్రి (మురళీధర్) తమ పూర్వీకుల కట్నం హిస్టరీ చెప్పి 2 కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా పెళ్ళి చేసుకోకూడదు అని చెప్పడంతో చేసేదేం లేక అలాంటి సంబంధం కోసం చూస్తూ ఉంటాడు. అమ్మాయి అయితే చాలు 2 కోట్లు కట్నం ఇస్తే పెళ్లి చేసుకంటాను అనే పొజిషన్ లో ఉంటాడు ప్రసాద్.
ఇంటికి వచ్చాక అనుకోకుండా అదే ఊరిలో ఉండే ప్రియ ( ప్రియాంక శర్మ) ప్రసాద్ కి పరిచయం అవుతుంది. ప్రియ తన తల్లితండ్రులు, అమ్మమ్మతో కలిసి ఫారిన్ లో ఉంటున్న అబ్బాయిని పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అవ్వాలని కలలు కంటుంది. అదే సమయంలో ఊరికి వచ్చిన ప్రసాద్ మలేషియాలో ఉంటాడు అని తెలిసి అతన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది. కానీ పెళ్లి అయ్యాక ప్రసాద్ ఇంక ఫారిన్ వెళ్లకూడదు అనుకుంటాడు. దీంతో భార్య భర్తలు, ప్రియ ఫ్యామిలీతో ప్రసాద్ కు మధ్య గొడవలు అవుతాయి. ప్రసాద్ ఎందుకు మళ్ళీ మలేషియా వెళ్ళకూడదు అనుకున్నాడు? ప్రియ ఎందుకు ఫారిన్ వెళ్ళాలి అనుకుంటుంది? పెళ్లి తర్వాత ప్రసాద్ ఎలాంటి కష్టాలు పడ్డాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Killer Artiste : ‘కిల్లర్ ఆర్టిస్ట్’ మూవీ రివ్యూ.. మర్డర్ చేయడం ఒక కళ అంటున్న ఆర్టిస్ట్..
సినిమా విశ్లేషణ.. పెళ్లి చుట్టూ ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. పెళ్లి కాని ప్రసాద్ అనేది వెంకటేష్ పాత్రల్లో ఓ ఐకానిక్ క్యారెక్టర్. అలాంటి ఐకానిక్ క్యారెక్టర్ తో సప్తగిరి సినిమా చేయడం ఒక సాహసమే. సమాజంలో ఇటీవల పెళ్లిళ్లు చాలా మంది పలు కారణాలతో లేట్ గా చేసుకుంటున్నారు. అలాంటి కొన్ని కారణాలు హీరో, హీరోయిన్ తరపున ఇందులో కామెడీగా చూపించారు.
పెళ్లి కోసం ఎదురుచూస్తూ ఫారెన్ లో ఉన్న ప్రసాద్, వాళ్ళ నాన్న ఇక్కడ కట్నం కోసం ఎదురుచూపులు, ఆ తర్వాత హీరో ఊరికి వచ్చి పెళ్లి ప్రయత్నాలతో సాగుతుంది. ఇక ప్రియ ఫారెన్ వెళ్లడం కోసం ప్రసాద్ ని ట్రాప్ చేసుకొని పెళ్లి చేసుకోవడం, ప్రసాద్ ఫారెన్ వెళ్ళడు అని తెలియడంతో ఆ తర్వాత నుంచి మరింత ఆసక్తిగా మారి కామెడీతో నవ్వించారు. చివర్లో కాస్త ఎమోషన్ ట్రై చేసారు. అయితే దర్శకుడు సినిమా ఆద్యంతం నవ్వించడానికి ప్రయత్నించాడు. చాలా వరకు కామెడీ వర్కౌట్ అయినా కొన్ని సీన్స్ లో మాత్రం మరీ ఓవర్ అనిపిస్తుంది. క్లైమాక్స్ ఇంకాస్త బెటర్ గా రాసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి నవ్వుకోడానికి ఈ సినిమాకు వెళ్లొచ్చు.
నటీనటుల్ పర్ఫార్మెన్స్.. కమెడియన్ గా ఇప్పటికే అనేక సినిమాలతో మెప్పించిన సప్తగిరి గతంలో కూడా హీరోగా పలు సినిమాలతో పర్వాలేదనిపించారు. ఇప్పుడు ఫుల్ గా ప్రేక్షకులను నవ్వించడానికి ఈ పెళ్లి కాని ప్రసాద్ పాత్రలో సప్తగిరి బాగా కష్టపడ్డాడు. మురళీధర్ గౌడ్ కూడా సప్తగిరి తండ్రి పాత్రలో ఫుల్ గా నవ్వించాడు. హీరోయిన్ ప్రియ శర్మ బాగానే మెప్పించింది. అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, వడ్లమాని శ్రీనివాస్, పాషా, మీసాల లక్ష్మణ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
Also Read : Tuk Tuk : ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ.. భలే క్యూట్ గా ఉందే సినిమా..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గానే ఉన్నాయి. పాటలు యావరేజ్ అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కామెడీ సీన్స్ లో సరైన బ్యాక్ గ్రౌండ్ పడింది. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. పెళ్లి చుట్టూ తిరిగే పాత కథ అయినా ఓ మెసేజ్ ని కూడా ఆద్యంతం నవ్విస్తూ చెప్పడానికి మంచి ప్రయత్నమే చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘పెళ్ళి కాని ప్రసాద్’ పెళ్లి కోసం, పెళ్లి తర్వాత పడే తంటాలతో బాగానే నవ్వించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.