వైరల్ వీడియో : సారా చేయిని ముద్దాడిన ఫ్యాన్

  • Published By: madhu ,Published On : January 10, 2020 / 09:08 AM IST
వైరల్ వీడియో : సారా చేయిని ముద్దాడిన ఫ్యాన్

Updated On : January 10, 2020 / 9:08 AM IST

టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్‌లలో ఎంతో మంది హీరోయిన్లకు, హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. వీళ్లను ఎంతో అభిమానంగా చూసుకుంటుంటారు. వీరి చిత్రాలు రిలీజ్ అయితే..చాలు వారి ఆనందానికి హద్దులే ఉండవు. అంతగా ప్రేమిస్తారు. కానీ కొంతమంది ఫ్యాన్స్ నిర్వాకం వల్ల హీరోలు, హీరోయిన్లు ఇబ్బందులు పడుతుంటారు. ఇలాగే సారా అలీఖాన్ ఇబ్బందులు పడ్డారు. ఓ అభిమాని చేసిన చర్యతో సారా షాక్ తిన్నారు. 

అసలేం జరిగిందంటే : 

జిమ్ నుంచి సారా అలీఖాన్ బయటకు వచ్చారు. అప్పటికే ఫ్యాన్స్, ఫొటోగ్రాఫర్లు వేచి ఉన్నారు. అందరికీ హాయ్ చెబుతూ కారు డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు సారా. కానీ ప్లీజ్ ఫొటోస్ అనగా..సున్నితంగా తిరస్కరించారు. కానీ ఫొటోలకు ఫొజులివ్వాలని కోరడంతో..అలాగే చేశారు. కొంతమంది అభిమానులతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇవ్వాలంటూ చేయిని అందించారు. సారా వెంటనే చేయి అందించారు.

అంతే..అక్కడున్న వారందరూ షాక్. సారా చేయిని ఆ ఫ్యాన్ ముద్దాడారు. వెంటనే అక్కడున్న బాడీగార్డ్ కొట్టబోయాడు. తర్వాత సారా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సారా మీ అందానికి చాలా మంది ఫిదా అయిపోతున్నారు..సెక్యూర్టీని పెంచుకోవాలంటూ సూచిస్తున్నారు. 

Read More : సరిలేరు నీకెవ్వరు.. అల.. అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

సారా అలీఖాన్..బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కుమార్తె. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ..హిందీ సినిమాల్లో ప్రవేశించింది సారా. కేదర్ నాథ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన సింబాలో రణ్ వీర్ సింగ్‌తో నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్‌ చూసింది. ఇతర సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. తన అందాల హాట్ ఫొటోస్ పోస్టు చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.