భారీ ధరకు సరిలేరు నీకెవ్వరు – ఓవర్సీస్ రైట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు'.. ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి..

  • Published By: sekhar ,Published On : September 28, 2019 / 09:21 AM IST
భారీ ధరకు సరిలేరు నీకెవ్వరు – ఓవర్సీస్ రైట్స్

Updated On : September 28, 2019 / 9:21 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’.. ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి..

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘సరిలేరు నీకెవ్వరు’.. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. విజయశాంతి ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెట్ దగ్గర షూటింగ్ జరుగుతుంది.

రీసెంట్‌గా ‘సరిలేరు నీకెవ్వరు’ ఓవర్సీస్ బిజినెస్ డీల్ క్లోజ్ అయ్యింది. గ్రేట్ ఇండియా ఫిలింస్ రూ.13.50 కోట్లకు ‘సరిలేరు నీకెవ్వరు’ ఓవర్సీస్ హక్కులు కొనుగోలు చేసింది. మహేష్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉండడంతో.. ఇంత భారీ ధరకు హక్కులు అమ్ముడయ్యాయి.

Read Also : 18 ఏళ్ళ స్టూడెంట్ నెం.1 – ఆ రోజులు గుర్తు చేసుకున్న జక్కన్న, తారక్!

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి వరస హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ సినిమాలో మహేష్ బాబుని మేజర్ అజయ్ కృష్ణగా చూపించనున్నాడు. రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.