అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చిరంజీవి: మహేష్ బాబు కోసం.. అదే వేదికపై!

‘భరత్ అను నేను’, ‘మహర్షి’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. సక్సెస్‌ఫుల్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11వ తేదీ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను సిద్ధం చేస్తుంది చిత్రయూనిట్. సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి పాటకూ, టీజర్, పోస్టర్లకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది.అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్రయూనిట్ జనవరి 5వ తేదీన గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేసింది.
ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ముఖ్య అతిధిగా తీసుకుని రావాలని ప్లాన్ చేసింది చిత్రయూనిట్. అయితే ఇప్పుడు చరణ్‌కి బదులుగా చిరంజీవి ఈ ఈవెంట్‌కి వస్తున్నారట. ఈ సినిమా ఫంక్షన్ జనవరి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. దీనికి భారీగా ఫ్యాన్స్ వస్తారని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. గతంలో 2018 ఏప్రిల్ ఏడో తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు అదే వేదికపైకి మహేష్ కోసం చిరంజీవి రానున్నారట. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందనా హీరోయిన్. లేడీ అమితాబ్ విజయశాంతి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది.