Sarkaru Vaari Paata: దుమ్ములేపిన సర్కారు వారి పాట.. డే1 కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ షేక్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య నిన్న(మే 12) ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య...

Sarkaru Vaari Paata Day 1 Collections
Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య నిన్న(మే 12) ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మహేష్ మాస్ స్వాగ్‌తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అయితే ఈ సినిమాకు రివ్యూలు మాత్రం అంతంత మాత్రంగా రావడంతో ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
Sarkaru Vaari Paata: యాంటీ ఫ్యాన్స్ రచ్చ.. ట్రెండింగ్‌లో #DisasterSVP హ్యాష్ ట్యాగ్!
ప్రపంచవ్యాప్తంగా మహేష్‌కు ఉన్న క్రేజ్‌తో ఈ సినిమాకు తొలి రోజున కళ్లు చెదిరే వసూళ్లు వచ్చి పడ్డాయి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.36.63 కోట్ల షేర్ వసూళ్లు సాధించి అదరగొట్టింది. పాండెమిక్ తరువాత తొలిరోజు ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో ఆర్ఆర్ఆర్ తరువాత సర్కారు వారి పాటకే సాధ్యమయ్యింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని వారు ప్రకటించారు. తొలిరోజే ఈ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించిన సర్కారు వారి పాట, ఈ వీకెండ్‌లో మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయమని చిత్ర విశ్లేషకులు అంటున్నారు.
Sarkaru Vaari Paata : థియేటర్లో మహేష్ ఫ్యాన్స్ హంగామా.. థియేటర్ యాజమాన్యంతో గొడవ..
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మైండ్‌బ్లోయింగ్ వసూళ్లు రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మహేష్ సరసన ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ నటించగా.. నదియా, సముద్రఖని, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఈ సినిమాలో నటించారు. ఇక ఏరియాలవారీగా సర్కారు వారి పాట తొలి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 12.21 కోట్లు
సీడెడ్ – 4.7 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.73 కోట్లు
ఈస్ట్ – 3.25 కోట్లు
వెస్ట్ – 2.74 కోట్లు
గుంటూరు – 5.83 కోట్లు
కృష్ణా – 2.58 కోట్లు
నెల్లూరు – 1.56 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.36.63 కోట్లు
Box Office Veta Shuru ??
ALL TIME RECORD for #SVP
75 Crores gross worldwide on Day 1 for #SarkaruVaariPaata#BlockbusterSVP #SVPMania
Super ? @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth pic.twitter.com/ohgWExyDSt
— SarkaruVaariPaata (@SVPTheFilm) May 13, 2022