Jr NTR-Mahesh Babu : సర్కారు వారి పాట షర్ట్స్.. జూనియర్ ఎన్టీఆర్ జీన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ టీ షర్ట్స్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రాండ్ జీన్స్ ప్యాంట్స్..

Jr NTR-Mahesh Babu : సర్కారు వారి పాట షర్ట్స్.. జూనియర్ ఎన్టీఆర్ జీన్స్..

Jr Ntr Mahesh Babu

Updated On : January 30, 2022 / 8:56 PM IST

Jr NTR-Mahesh Babu: స్క్రీన్ మీద హీరోలు చేసే ఫీట్లకు ఫిదా అయ్యే అభిమానులు ఎందరో ఉంటారు. ఇక స్టార్ హీరోల వీరాభిమానుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో సినిమా విడుదల అంటే కటౌట్స్, ఫ్లెక్సీలు, పాలాభిషేకాలు, పుట్టినరోజులప్పుడు భారీ కేక్ కటింగ్స్, అన్నదానాలు, రక్తదానాలు మామూలు హంగామా చెయ్యరు.

Samyuktha Menon : మహేష్ పక్కన ‘భీమ్లా నాయక్’ బ్యూటీ

సెలబ్రిటీల హెయిర్ స్టైల్ దగ్గరినుండి ఫ్యాషన్ వరకు ఫాలో అవుతుంటారు చాలామంది ఫ్యాన్స్. కొద్ది కాలంగా టాటూల ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు పాత పద్ధతిని మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు మార్కెట్లో సౌందర్య చీర, చిరంజీవి చొక్కా అని సేల్ చేసేవారు.

Sarkaru Vaari Paata Shirts

తమ ఫేవరెట్ స్టార్స్ వేసుకున్న డ్రెస్ వేసుకుంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది అభిమానులకి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ లో వేసుకున్న టీ షర్ట్స్ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ లో ‘మైండ్ బ్లాక్’ సాంగ్‌లో వేసుకున్న టీ షర్ట్ కూడా అందుబాటులో ఉంది.

Jr Ntr Jeens Pants

షర్ట్, టీ షర్ట్స్ వరకు ఓకే.. మరి ప్యాంట్ సంగతి ఏంటి? అంటే.. అవి కూడా ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రాండ్ జీన్స్ ప్యాంటులు కూడా ఆన్‌లైన్‌లో దొరికేస్తున్నాయి. రెండు పాకెట్స్ మీద ఎన్టీఆర్ ఫొటోతో పాటు నేమ్ లోగోతో కూడిన జీన్స్ వచ్చేసాయి. ప్రస్తుతం నెట్టింట మహేష్ ఫ్యాన్స్.. షర్టులు, తారక్ అభిమానులు జీన్స్ ప్యాంట్స్ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.

NTR 30-Thalapathy Vijay : అనిరుద్ ఫిక్స్.. హెయిర్ స్టైలిష్‌తో విజయ్..