Tribanadhari Barbarik : ‘త్రిబాణధారి బార్బరిక్’ టీజర్ రిలీజ్.. భీముడి మనవడు మనుషుల మధ్యకు వస్తే..
నేడు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

Satya Raj Satyam Rajesh and Vasishta Simha Tribanadhari Barbarik Teaser Released
Tribanadhari Barbarik Teaser : ప్రస్తుతం మైథలాజికల్ సినిమాల హవా నడుస్తుంది. ప్రస్తుతం జరిగే కథకు పురాణాల్ని లింక్ పెట్టి సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇటీవల భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరికుడు పాత్రను ఆధారంగా తీసుకొని త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
Also Read : Vishal Madha Gaja Raja : 2013 సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్..
డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మాణంలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో ఈ త్రిబాణధారి బార్బరిక్ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ గ్లింప్స్ రిలీజ్ చేయగా నేడు టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా టీజర్ చూసేయండి..
టీజర్ చూస్తుంటే.. రెండు వేరువేరు కథలతో సస్పెన్స్ థ్రిల్లర్ గా అనిపిస్తుండగా ఓ అమ్మాయిని కాపాడటానికి బార్బరీకుడు వచ్చినట్టు చూపించారు. మరి ఈ కథ మన పురాణాలకు ఎలా లింక్ పెట్టారో చూడాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. సత్య రాజ్, సత్యం రాజేష్, వసిష్ఠ సింహ, సాంచి రాయ్, ఉదయభాను, Vtv గణేష్.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Priyanka Jawalkar : ప్రియాంక జవాల్కర్ న్యూ ఇయర్ స్పెషల్ ఫొటోలు చూశారా..? ఎంత అందంగా ఉందో..
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. బార్బరిక్ సినిమా కోసం నేను పనిచేయలేదు. కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చాను. ఇది చాలా రిస్కీ జానర్. ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. నిర్మాత విజయ్ గారితో కలిసి జీతెలుగుతో మరో సినిమాను చేయబోతున్నాను. మోహన్ లోపలకి బార్బరికుడు వెళ్లిపోయాడు. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న పాత్ర ప్రజెంట్ జనరేషన్‌కి వస్తే ఎలా ఉంటుందో చూపించారు. సత్య రాజ్ గారు బాహుబలి చేశారు.. బార్బరిక్ కూడా చేశారు. ఆయనకు కథ నచ్చితే ఏ సినిమాకైనా ఓకే చెప్తారు అని అన్నారు.
సత్య రాజ్ మాట్లాడుతూ.. బార్బరిక్ పక్కా కమర్షియల్ సినిమా. సత్యం రాజేష్ గారు సినిమాలో నాతో పాటే ఉంటారు. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఏజ్డ్ యాక్షన్ హీరో అనే ట్యాగ్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమాతో ఆ ట్యాగ్ వస్తుంది నాకు. ఈ సినిమాకు తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలో నేనే డబ్బింగ్ చెప్పాను అని తెలిపారు. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ.. వానర సెల్యూలాయిడ్ అనేది మా తల్లిదండ్రుల పేరు మీదుగా పెట్టాను. మారుతి గారితో కలిసి ఈ సినిమా చేస్తున్నాను. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. బార్బరిక్ లాంటి పెద్ద సినిమాను చేస్తానని అనుకోలేదు. ఈ సినిమా కోసం ఇంఫ్యూజన్ బాండ్‌ను తీసుకొచ్చాను అని తెలిపారు.
డైరెక్టర్ మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ.. బార్బరిక్ టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిర్మాత విజయ్ గారు నేను చెప్పిన కంటెంట్, కథను నమ్మి నాకు కావాల్సినంత బడ్జెట్ ఇచ్చారు. మారుతి గారు ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటారు. సత్యరాజ్ ఈ పాత్రను చాలా ప్రేమించారు. అర్దరాత్రి షూటింగ్ అయినా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. బార్బరికుడికి త్రిబాణాస్త్రం ఉన్నట్టు నాకు మూడు అస్త్రాలున్నాయి. ఒకటి డీఓపీ రమేష్, రెండు ఫ్యూజన్ బాండ్, మూడు ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్. ఈ మూడు అస్త్రాలతో నేను ఆడియెన్స్ ముందుకు త్వరలో రాబోతున్నాను అని అన్నారు. సత్యం రాజేష్ మాట్లాడుతూ.. బార్బరిక్ సినిమా చాలా బాగుంటుంది. నాకు మంచి పాత్ర వచ్చింది. దీని మీద ఎంత బడ్జెట్ పెట్టారో కూడా ఊహించలేరు. ఒక మినీ బాహుబలిలా ఉంటుంది అని అన్నారు.