Tribanadhari Barbarik : ‘త్రిబాణధారి బార్బరిక్‌’ థీమ్ సాంగ్ రిలీజ్.. విన్నారా?

తాజాగా ఈ సినిమా థీమ్ సాంగ్ ని రిలీజ్ చేసారు.

Tribanadhari Barbarik : ‘త్రిబాణధారి బార్బరిక్‌’ థీమ్ సాంగ్ రిలీజ్.. విన్నారా?

Satya Raj Tribanadhari Barbarik Movie Theme Song Released

Updated On : June 1, 2025 / 5:48 PM IST

Tribanadhari Barbarik : వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరికుడు కి లింక్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్‌‌లతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా థీమ్ సాంగ్ ని రిలీజ్ చేసారు. బార్బరిక్ మూవీ కాన్సెప్ట్ తెలియజేసేలా ఓ థీమ్ సాంగ్‌ను చేసారు. ఈ పాటను సనారే రాయగా కృష్ణ చైతన్య, సాయి చరణ్, శివ, హర్ష వర్దన్, వల్లి గాయత్రి, సింధూజ శ్రీనివాసన్, నాద ప్రియ, బృంద కలిసి ఆలపించారు. ఆదిత్య అయ్యంగార్ ఈ ర్యాప్‌ను పాడారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ మ్యూజిక్ అందించింది.

Also Read : Pawan Kalyan : OG షూటింగ్ షెడ్యూల్ పూర్తి.. ముంబై నుంచి పవన్ రిటర్న్..? OG కి మళ్ళీ బ్రేక్..

మీరు కూడా ఈ పాట వినేయండి..