Sricharan Pakala : అది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.. నటుడిగా కూడా చేస్తాను..
తాజాగా సత్యభామ సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మీడియాతో ముచ్చటించాడు.

Satyabhama Music Director Sricharan Pakala Tells about his Music
Music Director Sricharan Pakala : కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) పెళ్లి తర్వాత తెలుగులో సత్యభామ(Satyabhama) సినిమాతో కంబ్యాక్ ఇస్తుంది. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాణంలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జూన్ 7న సత్యభామ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మీడియాతో ముచ్చటించాడు.
శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. కాజల్ లీడ్ రోల్, నేను చేయబోతున్న ఫస్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అవడంతో చాలా ఎగ్జైట్ అనిపించింది. శశికిరణ్ తో ఇది నాకు మూడో సినిమా. ఈ టీమ్ అంతా నాకు తెలుసు. పదేళ్లుగా కలిసున్న ఫ్రెండ్స్ తో ఈ సినిమా చేశాను. కాజల్ కు ఈ సినిమా పర్పెక్ట్ కమ్ బ్యాక్ ఇస్తుంది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి సత్యభామ నచ్చుతుంది. ఇందులోని ట్విస్ట్ లు, యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోతాయి. అలాగే ఓ పోలీస్ ఎమోషనల్ జర్నీ కూడా బాగుంటుంది అని తెలిపారు.
Also Read : Kalki 2898AD : కల్కి సినిమాలో ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా గెస్ట్ అప్పీరెన్స్.. ఇంతమంది స్టార్లు నిజమేనా?
తను ఇచ్చిన సంగీతం గురించి చెప్తూ.. సత్యభామ సినిమాలో మొత్తం ఐదు పాటలుంటాయి. ముందు రెండు అనుకోని ఆ తర్వాత పెంచాము. ఒక సాంగ్ కాజల్, నవీన్ చంద్ర మధ్య వచ్చే లవ్ సాంగ్, ఇంకోటి వెతుకు వెతుకు.. అని కీరవాణి గారు పాడారు. ఒక ఇంగ్లీష్ సాంగ్ చేశాం. వెతుకు వెతుకు పాటకు కీరవాణి, చంద్రబోస్ గార్లతో కలిసి పని చేయడం మర్చిపోలేని విషయం. వాళ్లు అంత సీనియర్స్ అయి ఉండి, ఆస్కార్ సాధించి కూడా సింపుల్ గా ఉంటూ వర్క్ విషయంలో సపోర్ట్ చేస్తారు. యాక్షన్స్ కి మంచి BGM వచ్చింది.
అయితే శ్రీచరణ్ కు కేవలం థ్రిల్లర్ మ్యూజిక్ బాగా ఇస్తాడు అనే పేరు ఉంది. దీంతో వేరే సినిమా ఆఫర్లు రావట్లేదు, మంచి పాటలు అతని వద్ద నుంచి రావట్లేదు అనే దానిపై స్పందిస్తూ.. థ్రిల్లర్ మూవీస్ కు ఎక్కువ పని చేస్తాను, బ్యాక్ గ్రౌండ్ బాగా ఇస్తాను అని వచ్చిన పేరు నాకు ఇబ్బందిగానే ఉంది. అయినా నేను కృష్ణ అండ్ హిస్ లీల, డీజే టిల్లు, గుంటూరు టాకీస్.. లాంటి లవ్, కమర్షియల్ సినిమాలు కూడా చేశాను. కానీ థ్రిల్లర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ముద్ర వచ్చేసింది. నాకు మాస్, కమర్షియల్, లవ్ సినిమాలు చేయాలని ఉంది. థ్రిల్లర్ మూవీస్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టే దానికి పేరొస్తుంది. పాటలు బాగున్నా ఆడియెన్స్ BGMకు ఎక్కువ కనెక్ట్ అవుతారు అని తెలిపారు.
అలాగే ఆర్టిస్ట్ గా కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. భవిష్యత్తులో కూడా అవకాశాలు వస్తే చేస్తాను అని తెలిపారు. త్వరలో ప్రైవేట్ ఆల్బమ్ ఒకటి రిలీజ్ చేస్తున్నాను అని తెలిపారు.