Kalki 2898AD : కల్కి సినిమాలో ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా గెస్ట్ అప్పీరెన్స్.. ఇంతమంది స్టార్లు నిజమేనా?
కల్కి సినిమాలో చాలా మంది స్టార్లు ఉన్న సంగతి తెలిసిందే.

Kalki 2898AD Movie having another two star actress guest Appearance rumours goes Viral
Kalki 2898AD : ప్రభాస్ కల్కి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కింది ఈ సినిమా. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, యానిమేషన్ సిరీస్ లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో చాలా మంది స్టార్లు ఉన్న సంగతి తెలిసిందే.
కల్కిలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. ఉన్నారని ఆల్రెడీ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో మరింతమంది స్టార్లు గెస్ట్ అప్పీరెన్స్ లు ఇవ్వబోతున్నారని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. కల్కి సినిమాలో నాని, విజయ్ దేవరకొండ, రాజమౌళి, ఆర్జీవీ, దుల్కర్ సల్మాన్, రానా.. ఉన్నారని వార్తలు వచ్చాయి.
Also Read : Love Today : జాన్వీ కపూర్ చెల్లితో ‘లవ్ టుడే’ రీమేక్.. స్టార్ హీరో తనయుడు హీరోగా..
తాజాగా ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్ తో పాటు, సీనియర్ నటి శోభన కూడా కల్కి సినిమాలో గెస్ట్ పాత్రలు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో ఎంతమంది స్టార్స్ కనిపిస్తారో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ వార్తలు అన్ని నిజమేనా తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఇక కల్కి సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.