‘Save Tamil Nadu’: సీఎం జగన్‌తో స్టార్ హీరో విజయ్ పోస్టర్లు

‘Save Tamil Nadu’: సీఎం జగన్‌తో స్టార్ హీరో విజయ్ పోస్టర్లు

Updated On : February 12, 2020 / 3:29 AM IST

తమిళ్ యాక్టర్ దళపతి విజయ్.. తో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పోస్టర్లు రాష్ట్రమంతా చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ ఇంటిపై దాదాపు 23గంటల పాటు జరిగిన ఐటీ దాడుల తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దళపతి విజయ్‌కు సపోర్ట్‌గా నిలిచారు ఫ్యాన్స్. అంతేకాకుండా విజయ్ ఒక్కడే తమిళనాడును రక్షిస్తాడు అంటున్నారు పోస్టర్లతో అభిమానులు. ఈ పోస్టర్లలో ఒకటి చర్చనీయాంశంగా మారింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటు రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ లు కలిసి తమిళనాడును సేవ్ చేస్తారంట. ఆ పోస్టర్లో ‘మేం ఆంధ్రను బతికించుకున్నాం. మీరే సమస్యల్లో ఉన్న తమిళనాడును కాపాడుకోవాలి. ప్రజా సంక్షేమం గురించి జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ మెసేజ్ కూడా ఉంచారు. 

గత వారం చెన్నైలో ఉన్న విజయ్ ఇంటిపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఆ సమయంలో విజయ్ నవేలీ ప్రాంతంలో మాస్టర్ సినిమా షూటింగ్‌లో ఉండగా ఏజెంట్లు చెన్నైకు తీసుకొచ్చేశారు. బిగిల్ నిర్మాతలకు చెందిన ఏజీఎస్ ప్రొడక్షన్ కంపెనీ దాడుల అనంతరం విజయ్ ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈయన పెట్టుబడులు అన్ని స్థిరాస్థులు మీదనే ఉన్నాయి. బిగిల్ రెమ్యూనరేషన్ ఏం చేశారనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నాం’ అని అన్నారు. 

విజయ్ స్వతహాగా రాజకీయ ఆసక్తి ఉన్న వ్యక్తే. అతని సినిమాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేసినప్పటి నుంచి తమిళనాడు రాజకీయ పార్టీలన్నీ ఏకమై విజయ్‌ను టార్గెట్ చేశాయి. దాడులు జరిగిన తర్వాత అనూహ్యంగా రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు నేవేలీలో విజయ్ షూటింగ్ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు మాస్టర్ షూటింగ్ ను పూర్తి చేశారు. షూటింగ్ జరిగినన్నీ రోజులు ఆ ప్రాంతంలో అభిమానులు వేల సంఖ్యలో విజయ్ కోసం వచ్చారు.