రాజమండ్రి సెంట్రల్ జైల్లో కమల్ హాసన్

  • Published By: venkaiahnaidu ,Published On : September 17, 2019 / 03:49 PM IST
రాజమండ్రి సెంట్రల్ జైల్లో కమల్ హాసన్

Updated On : September 17, 2019 / 3:49 PM IST

20ఏళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు శంకర్,లోకనాయకుడు కమల్‌ హాసన్‌ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఇండియన్‌ 2 పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ కొంత పూర్తవగా.. రెండవ షెడ్యూల్‌ ను ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ప్లాన్‌ చేసింది మూవీ యూనిట్ చిత్ర బృందం. కమల్‌ తో సహా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న నటీనటుల ఈ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

ఈ నెల 19 నుంచి రాజమండ్రి జైల్లో రెగ్యులర్‌గా షూటింగ్‌ జరగనుందని సమాచారం. ఇక్కడ షూటింగ్‌ ముగిసిన అనంతరం తరువాతి షెడ్యూల్‌ కోసం విదేశాలకు పయనమయ్యే అవకాశం ఉంది. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళా సాధికారిత అంశాలపై ‘ఇండియన్‌ 2’ కథనం ఉండనుందని టాక్. లైకా ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు.