second single poster from Game Changer
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. కియార అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ‘జరగండి’ సాంగ్ అందరినీ అలరించింది.
ఇక తాజాగా రెండో సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. కళ్ళద్దాలు పెట్టుకుని ఎంతో స్టైలిష్‌గా రామ్‌చరణ్ ఇందులో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
‘రా మచ్చా మచ్చా..’ అంటూ ఈ పాట సాగనున్నట్లు సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే వెల్లడించారు. సాంగ్ ప్రొమోను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈ మూవీని శ్రీవేంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అంజలీ, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, జయరాం, సునీల్, సముద్ర ఖనీ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఏడు పాటలు ఉంటాయని ఇటీవల తమన్ చెప్పాడు.
The festivities begin! ✨🎉 Second single promo #RaaMachaMacha (Telugu & Tamil) #DamTuDikhaja (Hindi) from #GameChanger is arriving on 28th September!
Brace yourself for the beats and excitement! 🥁🎶
Global Star @AlwaysRamCharan @shankarshanmugh @iam_SJSuryah @advani_kiara… pic.twitter.com/YW7MQ42Lz3
— Sri Venkateswara Creations (@SVC_official) September 25, 2024