Bigg Boss 8 : సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్‌.. ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. చ‌రిత్ర‌లో తొలిసారి..

కంటెస్టెంట్ల‌కు బిగ్‌షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్‌.

Bigg Boss 8 : సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్‌.. ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. చ‌రిత్ర‌లో తొలిసారి..

Bigg Boss Telugu 8 Day 24 Promo 2 Wildest Twist Ever

Updated On : September 25, 2024 / 3:16 PM IST

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో నాలుగో వారం కొన‌సాగుతోంది. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రొమో వ‌చ్చేసింది. కంటెస్టెంట్ల‌కు బిగ్‌షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండ‌బోతున్నాయి. దీంతో కొంత మంది బ‌య‌ట‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చెప్పాడు.

ప్రొమో ఆరంభంలో సీత క్లాన్‌లోకి అంద‌రూ వెళ్ల‌డంపై డిస్క‌ష‌న్ జ‌రిగింది. నిఖిల్ క్లాన్‌లోకి పృథ్వీ, సోనియా త‌ప్పితే మ‌రెవ‌రూ వెళ్లాల‌ని అనుకోవ‌డం లేద‌ని ప్రొమోను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. అంద‌రూ హాల్‌లో కూర్చున్న త‌రువాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. ఇంట్లో ఓ పెద్ద భూకంపం రాబోతుంద‌ని చెప్పాడు. మీ మ‌నుగ‌ను స‌వాల్ చేస్తూ మిమ్మ‌ల్మి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు తీసుకువెళ్ల‌వ‌చ్చున‌ని అన్నాడు.

Urmila : భర్తతో ఆర్జీవీ హీరోయిన్ విడాకులు..? తనకంటే పదేళ్లు చిన్న అబ్బాయిని పెళ్లి చేసుకొని.. 8 ఏళ్ళ తర్వాత..

బిగ్‌బాస్ చ‌రిత్ర‌లో ఒక‌టి కాదు.. రెండూ కాదు.. ఐదు కాదు.. ఏకంగా 12 వైల్డ్ కార్డ ఎంట్రీస్ ఉంటాయ‌ని, మ‌రొక రెండు వారాల్లో రాబోతున్నార‌ని బాంబు పేల్చాడు. అయితే.. వారు రాకుండా అడ్డుకునే ప‌వ‌ర్‌ను సైతం హౌస్‌మేట్స్‌కు ఉంద‌న్నాడు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ గెలిచిన ప్ర‌తి సారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చున‌ని అన్నాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు.

ఇక ప్రొమో ఆఖ‌రిలో మ‌రో మూడు, నాలుగు రోజుల్లో 12 టాస్కులు ఉంటాయ‌న్న మాట అని ఆదిత్య అన‌గా.. టాస్క్ ఫెయిల్ అయిన వెంట‌నే ఒక‌రు లోప‌లికి ఎంట్రీ ఇస్తారు అంతేనా అని మ‌ణికంఠ అన్నాడు. ఏమో నాకు తెలియ‌దు అని ఆదిత్య చెప్పాడు.

Bigg Boss 8 : ఈసారి సీత వర్సెస్ నిఖిల్.. యష్మి విషయంలో ప్రేరణ ఏం చేస్తదో..