Bigg Boss 8 : ఈసారి సీత వర్సెస్ నిఖిల్.. యష్మి విషయంలో ప్రేరణ ఏం చేస్తదో..
ఈ వారం గేమ్ అంతా నిఖిల్ వర్సెస్ సీత జరగబోతున్నట్టు తెలుస్తుంది.

Bigg Boss Telugu Season 8 Latest Promo Nikhil Vs Seetha
Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారం సాగుతుంది. నామినేషన్స్ అయ్యాక ఇప్పుడు శక్తి, కాంతార టీమ్స్ లో మళ్ళీ విభజన జరిగింది. నిన్న టాస్క్ లో సీత గెలిచి కాంతార క్లాన్ అయింది. తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు.
ఈ ప్రోమోలో సీతని అభినందించి సీతకు కాంతార కుర్చీ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత నిఖిల్, సీత టీమ్స్ లోకి ఎవరు ఏ టీమ్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో, ఎందుకో కారణాలు చెప్పి వెళ్ళమని బిగ్ బాస్ చెప్పాడు. కంటెస్టెంట్స్ అంతా తమకు కావలిసిన టీమ్ లోకి వెళ్లారు. ఈ వారం గేమ్ అంతా నిఖిల్ వర్సెస్ సీత జరగబోతున్నట్టు తెలుస్తుంది.
Also Read : Soniya – RGV : బిగ్ బాస్ సోనియాకు సపోర్ట్ గా ఆర్జీవీ పోస్ట్.. సోనియాతో దిగిన ఫోటో షేర్ చేసి..
విష్ణుప్రియ సీత టీమ్ లోకి వెళ్ళింది. సోనియా నిఖిల్ టీమ్ కి, నైనికా సీత టీమ్ కి, పృథ్వీ నిఖిల్ టీమ్ కు, నబిల్ సీత టీమ్ కి వెళ్లారు. యష్మి సీత టీమ్ కు వెళ్తాను అని చెప్పడంతో ప్రేరణ ఒక్క నిమిషం బిగ్ బాస్ అంటూ ఆపింది. మరి యష్మి సీత టీమ్ కి వెళ్లిందా? యష్మి – ప్రేరణ మధ్య ఏం జరిగింది? మిగిలిన నాగ మణికంఠ, ఆదిత్య, ప్రేరణ ఎవరు ఏ టీమ్స్ కి వెళ్లారు తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే. మీరు కూడా ప్రోమో చూసేయండి..