Urmila : భర్తతో ఆర్జీవీ హీరోయిన్ విడాకులు..? తనకంటే పదేళ్లు చిన్న అబ్బాయిని పెళ్లి చేసుకొని.. 8 ఏళ్ళ తర్వాత..
ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు.

Urmila Matondkar Files For Divorce From Mohsin Akhtar Report
Urmila Matondkar : ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. కొన్నేళ్ల పాటు కలిసి జీవించినప్పటికి తమ జీవిత భాగస్వామితో విడిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ నటి ఊర్మిళ మతోండ్కర్ చేరింది. ఆమె తన భర్త మోసిన్ అక్తార్ మిర్‌తో విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ముంబైలోని ఓ న్యాయస్థానంలో నాలుగు నెలల క్రితమే ఆమె విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కాగా.. దీనిపై ఊర్మిళ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. విడాకులు తీసుకోవడం ఆమె భర్తకు ఇష్టం లేదని, ఊర్మిళనే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లుగా చెబుతున్నారు. ఏ కారణం వల్ల ఆమె ఈ నిర్ణయం తీసుకుందో తెలియదు.
KTR – Devara : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై కేటీఆర్ కామెంట్స్..
ముంబైలో జన్మించింది ఊర్మిళ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కొన్నాళ్ల తరువాత హీరోయిన్‌గా మారింది. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన రంగీలా చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించింది.
2016 ఫిబ్రవరి 4వ తేదీని మోసిన్ అక్తార్ ను పెళ్లి చేసుకుంది. కాగా.. ఊర్మిళ కంటే మోసిన్ 10 ఏళ్ల చిన్నవాడు కావడం గమనార్హం. ఆ తరువాత రాజకీయాల్లో అడుపెట్టింది ఊర్మిళ. 2020లో శివసేనలో చేరారు.
Viswam : గోపీచంద్ రాబోయే సినిమాలోని.. ఎమోషనల్ తల్లి పాట విన్నారా..?