Viswam : గోపీచంద్ రాబోయే సినిమాలోని.. ఎమోషనల్ తల్లి పాట విన్నారా..?

తాజాగా గోపీచంద్ విశ్వం సినిమా నుంచి రెండో పాటని విడుదల చేసారు.

Viswam : గోపీచంద్ రాబోయే సినిమాలోని.. ఎమోషనల్ తల్లి పాట విన్నారా..?

Gopichand Viswam Movie Emotional Mother Sentiment Song Released

Updated On : September 25, 2024 / 12:57 PM IST

Viswam : హీరో గోపీచంద్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా దోనేపూడి చక్రపాణి ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, గ్లింప్స్, ఓ ఫాస్ట్ బీట్ సాంగ్ వచ్చి ప్రేక్షకులను మెప్పించాయి.

Also Read : Deavara – Naga Vamsi : అనవసరమైన ఫ్యాన్ వార్స్ ఇకనైనా ఆపండి.. దేవర రిలీజ్ కి ముందు నిర్మాత ట్వీట్ వైరల్..

తాజాగా గోపీచంద్ విశ్వం సినిమా నుంచి రెండో పాటని విడుదల చేసారు. ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’ అంటూ ఈ పాట ఎమోషనల్ గా సాగింది. మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ కథలోని ఎమోషనల్ కంటెంట్ గురించి చెప్తున్నట్టు ఉంది. ఈ పాటని శ్రీ హర్ష ఈమని రాయగా చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకత్వంలో సాహితీ చాగంటి ఈ పాట పాడింది. ప్రస్తుతం ఈ మదర్ ఎమోషనల్ సాంగ్ వైరల్ గా మారింది. ఇక విశ్వం సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది.

మీరు కూడా ఈ మదర్ సెంటిమెంట్ సాంగ్ ని వినేయండి..