KTR – Devara : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై కేటీఆర్ కామెంట్స్..
తాజాగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఓ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేసారు.

KTR Comments on NTR Devara Pre Release Event goes Viral
KTR – Devara : ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేయగా అభిమానులు ఎక్కువగా రావడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అనుకోని పరిస్థితుల్లో ఈవెంట్ రద్దు చేసారు.
తాజాగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఓ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేసారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, హైదరాబాద్ గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. మేము అన్ని రకాల పండగలు, ఈవెంట్లు శాంతియుతంగా చేసాము. చివరికి సినిమాలకు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసిన ఘనత మా ప్రభుత్వానిది. కానీ పాపం నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా. ఆయన ఇక్కడ ఏదో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా నిర్వహించేలేని అసమర్థత. అలాంటి పరిస్థితిలోకి ఈ నగరం వెళ్ళిపోయింది అంటూ కామెంట్స్ చేసారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Jr ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాలేదు ఈ అసమర్ధత ప్రభుత్వానికి – కేటీఆర్ pic.twitter.com/0I8CGXVEjt
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024