Sekhar Kammula : శివ షూటింగ్ లో నాగార్జున దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నా.. ధనుష్ లైఫ్ లో అలా అడిగింది ఫస్ట్ నేనే..
ఈ ఈవెంట్లో దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..

Sekhar Kammula Speech in Kuberaa Pre Release Event
Sekhar Kammula : నాగార్జున – ధనుష్ మల్టీస్టారర్ గా రష్మిక మందన్న ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేర. ఈ సినిమా జూన్ 20 రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ఇదొక కొత్త సినిమా. ఇప్పటివరకు ఎక్కడా చూసి ఉండరు. ఇది ట్రూ పాన్ ఇండియా సినిమా. తెలుగు – తమిళ్ లో షాట్ చేసాం. ముంబై బ్యాక్ డ్రాప్ కథ. ఇందులో అన్ని జానర్లు ఉంటాయి. మీకు కొత్త అనుభవం ఇస్తుంది. అందరూ ఇది నేను చేసే సినిమాలకు డిఫరెంట్ అంటున్నారు. ఇది అసలు అన్ని సినిమాలకు డిఫరెంట్. బాంబే, బ్యాంకాక్, గోవా, తిరుపతి, రోడ్ల మీద, చెత్త కుప్పల్లో, సముద్రాల దగ్గర షూట్ చేసాము. ఇందులో మెయిన్ వాళ్ళు కాకుండా చాలా మంది కొత్త వాళ్లే చేసారు. శివ షూటింగ్ లో నాగార్జున – అమల గారి మీద షూట్ చేస్తుంటే సంజీవ్ రెడ్డి నగర్ లో నేను వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నాగార్జున గారు రాత్రి షూటింగ్స్ చేయరు, కానీ ఈ సినిమాలో నా కోసం చేసారు. ఆయన ఆదివారాలు షూటింగ్ చేయరు, నా కోసం చేసారు. సినిమాలో చాలా చేసారు యాక్షన్ సీన్స్. నేను చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశాను. కానీ లోపల, బయట ఒకేలా ఉండే హీరోయిన్ రష్మికనే. చెత్తకుప్పల్లో కూడా వర్క్ చేసింది. ధనుష్ బిచ్చగాడు క్యారెక్టర్ బాగా చేసారు. మొదటి రోజు నాగార్జున గుర్తుపట్టలేదు. ధనుష్ లైఫ్ లో ఆయన్ని ఫస్ట్ సన్నబడమని అడిగింది నేనే అని చెప్పారు. ఆయన సన్నగా ఉంటారు కానీ సినిమా కోసం ఇంకా సన్నబడ్డాడు కూడా అని అన్నారు.
Also Read : Dhanush : ఈ సినిమాలో అసలు ఎవరు నటించారో కూడా నాకు తెలీదు.. ధనుష్ కామెంట్స్..