రాజు గారి చేపల పులుసు.. వాసన చూసి ఉప్పు గురించి చెప్పేస్తారట!

  • Published By: sekhar ,Published On : August 29, 2020 / 01:30 PM IST
రాజు గారి చేపల పులుసు.. వాసన చూసి ఉప్పు గురించి చెప్పేస్తారట!

Updated On : August 29, 2020 / 2:29 PM IST

Krishnamraju makes fish curry: సీనియర్ నటుడు కృష్ణంరాజు చేసిన చేపల పులుసు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడూ షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండే సినీ ప్రముఖులు లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. వంటింట్లోకి వెళ్లి ప్రయోగాలు చేస్తున్నారు. ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.



https://10tv.in/anchor-pradeep-response-allegations-molestation-case/
సీనియర్ నటుడు, రాజకీయ నేత కృష్ణంరాజు కూడా తాజాగా వంట చేశారు. ఆ వీడియోను ఆయన కుమార్తె ప్రసీద ఉప్పలపాటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు చేశారు. చేపల పులుసు చేయడంలో ఆయణ్ని మించిన వారు లేరు. కేవలం వాసన చూసి ఉప్పు సరిపోయిందో, లేదో చెప్పేస్తారు. ఆయన అందులో ఎక్స్‌పర్ట్’ అని ఆమె ట్వీట్ చేశారు. ప్రభాస్, కృష్ణంరాజు మాంచి భోజనప్రియులు అనే సంగతి తెలిసిందే. రాజు గారి చేపల పులుసు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.