Dilip Kumar : ఐసీయూలో ప్రముఖ నటుడు దిలీప్ కుమార్..
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు..

Senior Bollywood Actor Dilip Kumar Hospitalised
Dilip Kumar: ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కాగా ఒకే నెలలో ఆయన ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి.
బుధవారం(జూన్ 30) శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించగా కుటుంబ సభ్యులు దిలీప్ కుమార్‌ను ముంబైలోని హిందూజా హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్స్ ప్రస్తుతం ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు.. దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులకు చెప్పినట్టు నేషనల్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
అయితే జూన్ 6వ తేదీన కూడా ఇదే సమస్యతో దిలీప్ కుమార్‌ను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఊపిరితిత్తుల్లో సమస్యకు కారణమైన ఫ్లూయిడ్‌ని తొలగించి, జూన్ 11న డాక్టర్స్ డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్యం కుదుటపడుతుంది అనుకుంటుండగా.. మళ్లీ శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో దిలీప్ కుమార్‌ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.