Malayalam Actress : మలయాళ సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి మరణం..

తాజాగా మలయాళ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ సీనియర్ నటి కోజికోడ్ శారద గుండెపోటుతో మరణించారు. కొంతకాలంగా

Malayalam Actress : మలయాళ సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి మరణం..

Sarada (1)

Updated On : November 9, 2021 / 8:09 PM IST

Malayalam Actress :  గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమలో విషాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే కన్నడ పరిశ్రమలో పునీత్ మరణం అందర్నీ కలవర పెట్టింది. తాజాగా మలయాళ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ సీనియర్ నటి కోజికోడ్ శారద గుండెపోటుతో మరణించారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు నిన్న ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కేరళ కోజికోడ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆమె మరణించారు.

Adbhutham : ‘జాంబిరెడ్డి’తో రాజశేఖర్ పెద్ద కూతురు హీరోయిన్ గా ‘అద్భుతం’ .. ఓటిటిలో

శారద మృతి పట్ల కేరళ ఫిల్మ్స్ అండ్ కల్చర్ మంత్రి సాజి చెరియన్ సంతాపం తెలిపారు. అలాగే మలయాళ సినీ పరిశ్రమ స్టార్‌ హీరో పృధ్వీరాజ్‌, మోహన్‌ లాల్‌తో పాటు పలువురు నటీనటులు ఆమె మృతికి సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఇవాళ సాయంత్రం ఆమె స్వస్థలమైన కోజికోడ్‌లో అంత్యక్రియలు జరిగినట్లు సమాచారం.

RGV Ladki : చైనా ఫిలిం ఫెస్టివల్ కి ఆర్జీవీ సినిమా

మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న శారద నాటకాలతో తన కెరీర్ ని మొదలుపెట్టారు. 1979లో ‘అంగక్కురి’ చిత్రంతో ఆమె పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించారు. సినిమాలే కాక సీనియర్ ఆర్టిస్ట్ గా కొన్ని మలయాళ టీవీ సీరియల్స్‌లో కూడా శారద నటించారు. ఆమె మరణంతో మలయాళ సినీ, టీవీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.