Senior ntr called amma as Pundari Bhai after his own mother
100 Years of NTR : నందమూరి తారక రామారావు (NT Rama Rao) తెలుగు తెర పై చెరగని ముద్ర వేశారు. ఆయన నటనతో ఆడియన్స్ కి స్క్రీన్ పై పాత్రని మాత్రమే పరిచయం చేసి గొప్ప నటుడు అనిపించుకున్నారు. జానపధం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ప్రతి దానిలో ఎన్టీఆర్ (NTR) నటించి మెప్పించారు. ఒక నటుడు గానే కాదు రైటర్‌గా, దర్శకుడిగా కూడా పలు సినిమాలను తెరకెక్కించారు. ఈ సినీ జీవితంలో ఆయన తన తోటి నటీనటులకు మర్యాద ఇవ్వడమే కాకుండా వారితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.
NTR 100 Years : ఎన్టీఆర్ తీరని కోరికగా ఆ సినిమా మిగిలిపోయింది.. ఏంటది?
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన తల్లిని కాకుండా ఇండస్ట్రీలో మరో వ్యక్తిని ‘అమ్మ’ అని ప్రేమగా పిలిచేవారట. ఇండస్ట్రీలో తొలి తరం హీరోయిన్ గా అలరించిన ‘పుండరీ భాయి’ని ఎన్టీఆర్ అమ్మ అని పిలిచేవారు. ఎవరికైన సరే ఆమెను చూస్తే అమ్మ అని పిలవాలనిపించే అంత నిండుగా చీర కట్టుకొని కనిపించేవారట పుండరీ భాయి. పాతాళ భైరవి, గజదొంగ వంటి సూపర్ హిట్స్ తో పాటు దాదాపు 30 సినిమాలకు పైగా ఎన్టీఆర్ కి తల్లిగా స్క్రీన్ మీద కనిపించారు. సినిమాలో ఆమెను అమ్మ అని పిలిచే ఎన్టీఆర్.. నిజం జీవితంలో కూడా అమ్మ అనే ఎప్పుడు పిలిచేవారట.
NTR 100 Years : బాలకృష్ణ పెళ్ళికి వెళ్లని ఎన్టీఆర్.. రీజన్ ఏంటో తెలుసా?
అలా అమ్మ అని తనకి జన్మనించిన తల్లి తరువాత పుండరీ భాయిని మాత్రమే ఎన్టీఆర్ పిలిచేవారు. కాగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి జరుగుతుండడంతో.. గత ఏడాది మే 28 నుంచే ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ అంటూ సంవత్సరాది వేడుకలను బాలకృష్ణ (Balakrishna) మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా శత జయంతి అంకురార్పణ సభని కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఈ నెల 28న శత జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.