Harsha sai : సినిమా రైట్స్ ఇవ్వకపోతే వీడియోలు బయటపెడతాను అని బ్లాక్ మెయిల్.. హర్ష సాయి లీలలు..

నిన్న ఓ నటి హర్ష సాయి మోసం చేసాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Sensational Twist in You tuber Harsha Sai Case he Blackmailed

Harsha sai : యూట్యూబ్ లో పేదలకు సాయం చేస్తున్నాను అంటూ వీడియోలు చేసి పాపులర్ అయ్యాడు హర్ష సాయి. ఆ తర్వాత హర్ష సాయి హీరోగా మెగా అనే ఓ సినిమాని మొదలుపెట్టారు. ఆ సినిమాకు ఓ నటి నిర్మాతగా వ్యవహరించింది. తాజాగా నిన్న ఆ నటి హర్ష సాయి మోసం చేసాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Also Read : NTR – America : హాలీవుడ్ స్టేజిపై ఎన్టీఆర్.. ‘దేవర’ గురించి అమెరికా ఫిలిం ఫెస్ట్‌లో చెప్తున్న తారక్.. ఫొటో వైరల్..

ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసమే హర్ష సాయి ఇలాంటి పని చేసాడని, ప్రొడ్యూసర్ గా వ్యవరించిన బాధితురాలితో కాపీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం రావడంతో బాధితురాలికి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి హర్ష సాయి పాల్పడ్డాడని సమాచారం. బాధితురాలి వీడియోలు సీక్రెట్ గా రికార్డు చేసి సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే ఆ వీడియోలు బయట పెడతానని హర్ష సాయి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు తెలిపింది.