Pathaan : ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న షారుఖ్, దీపికా..

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్'. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు మళ్ళీ 8 ఏళ్ళ తరువాత ఈ జంట కలిసి నటిస్తుంది. కాగా పఠాన్ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. దీంతో మూవీ టీమ్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్.

Pathaan : ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న షారుఖ్, దీపికా..

Shah Rukh Khan and deepika shake the internet with besharam song

Updated On : December 13, 2022 / 10:44 AM IST

Pathaan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు మళ్ళీ 8 ఏళ్ళ తరువాత ఈ జంట కలిసి నటిస్తుంది. గతంలో ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో
ఆకట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు ఈ జంట కలిసి ఈ సినిమాలో కనిపించడంతో.. మూవీపై హైప్ కలిగేలా చేసింది.

Pathaan : ఒక్క సినిమా.. 8 దేశాల్లో షూటింగ్.. ‘పఠాన్’తో షారుఖ్ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ..

కాగా పఠాన్ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. దీంతో మూవీ టీమ్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. ‘బేషరమ్‌ రంగ్‌’ అంటూ సాగే ఈ రొమాంటిక్‌ సాంగ్‌ లో దీపికా బిక్కీనిలో అందాలు ఆరబోస్తూనే, గ్రేస్‌ఫుల్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. ఇక షారుఖ్ అయితే సిక్స్ ప్యాక్స్ లుక్స్ సూపర్ ఉన్నాడు.

ఇక పాట చివరిలో షారుఖ్, దీపికా మధ్య కెమిస్ట్రీ అయితే అందర్నీ ఆకట్టుకొని పాటని మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తుంది. దీంతో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కావడంతో.. ఇదే పాట తెలుగులో కూడా విడుదల చేశారు. తెలుగులో ‘నా నిజం రంగు’ అంటూ లిరిక్స్ సాగుతున్నాయి. మరి గత కొంతకాలంగా సరైన హిట్టు లేని షారుఖ్.. దీపికా సాయంతో హిట్టు బాటలోకి వస్తాడా లేదా అనేది చూడాలి.