Shah Rukh Khan : పఠాన్‌పై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన షారుఖ్..

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'పఠాన్'. జనవరి 25న విడుదల కానున్న ఈ మూవీ నుంచి ఇటీవల 'బేషరం రంగ్' అనే వీడియో పాటని విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ పాటపై సాధారణ ప్రేక్షకులు దగ్గర నుంచి రాజకీయనాయులు వరకు తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతుంది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ ఈ వివాదంపై పరోక్షంగా స్పందించాడు.

Shah Rukh Khan counter on boycott pathaan

Shah Rukh Khan : బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఈ చిత్రంలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. జనవరి 25న విడుదల కానున్న ఈ మూవీ నుంచి ఇటీవల ‘బేషరం రంగ్’ అనే వీడియో పాటని విడుదల చేశారు మేకర్స్.

Besharam Rang: వివాదాస్పదంగా మారిన పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట.. సినిమా విడుదల డౌటే అన్న ఎంపీ మంత్రి

కాగా ఈ పాటపై సాధారణ ప్రేక్షకులు దగ్గర నుంచి రాజకీయనాయులు వరకు తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతుంది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ ఈ వివాదంపై పరోక్షంగా స్పందించాడు. నిన్న కోల్‌కతాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరయ్యిన షారుఖ్, ఆ వేడుకలో ప్రసంగిస్తూ.. ‘సోషల్ మీడియా వ్యాప్తి, సినిమాపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటూ’ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

“సినిమా కథని అర్ధమయ్యేలా చెప్పేటప్పుడు మనిషి స్వభావం యొక్క దుర్బలత్వాన్ని బయటపెడుతోంది. అదే ఒకరి స్వభావాన్ని మరొకరు అర్ధంచేసుకొనేలా చేస్తుంది. కానీ దానిపై సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ సినిమాపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ మీడియా అంతకుమించి దుర్బలత్వాన్ని ప్రచారం చేస్తుంది. సోషల్ మీడియా నెగిటివిటీ వల్ల మనుషులు మధ్య విభేదాలు వస్తున్నాయి. కాబట్టి ఇంతటి ప్రతికూలత వ్యవస్థలో పోజిటివిటీతో ఆలోచించేవాడే బ్రతకగలడు. ఏదేమైనా నేను చాలా హ్యాపీగా ఉన్నాను” అంటూ వ్యాఖ్యానించాడు.