Besharam Rang: వివాదాస్పదంగా మారిన పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట.. సినిమా విడుదల డౌటే అన్న ఎంపీ మంత్రి

పఠాన్ సినిమాలో నటి దీపిక పదుకొనె తుక్డే తుక్డే గ్యాంగ్‭కు మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె దుస్తులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అలాగే పాటను డర్టీ మైండ్‭సెట్‭తో తెరకెక్కించారు. పాటలోని సీన్లు, కాస్ట్యూమ్స్ సరి చేయాలి. అలా చేయకపోతే మధ్యప్రదేశ్‭లో సినిమాను అనుమతించాలా వద్దా అని ఆలోచించాల్సి ఉంటుంది

Besharam Rang: వివాదాస్పదంగా మారిన పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట.. సినిమా విడుదల డౌటే అన్న ఎంపీ మంత్రి

Deepika Padukone's costumes in 'Besharam Rang' sparks row

Updated On : December 14, 2022 / 5:33 PM IST

Besharam Rang: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘పఠాన్’ సినిమాలోని ‘బేషరం రంగ్’ అనే పాట తాజాగా విడుదలై సినిమా ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. అయితే ఒకవైపు షారూఖ్, దీపిక అభిమానుల మనసుల్ని దోచుకుంటున్న ఈ పాట.. మరొకవైపు వివాదాస్పదంగా మారింది. కారణం.. పాటలోని లిరిక్స్ సహా.. దీపిక, షారూఖ్ వేసుకున్న బట్టలు. ఈ విషయమై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటలోని సీన్లు, కాస్ట్యూమ్స్ మార్చకపోతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సినిమాను విడుదల కానివ్వబోమంటూ ఆయన హెచ్చరించారు.

Apple iOS 16.2 Update : ఐఫోన్ 12 సహా ఆపై మోడళ్లలో 5G సపోర్టుతో iOS 16.2 అప్‌డేట్.. మీ ఐఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

ఈ విషయమై బుధవారం ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘పఠాన్ సినిమాలో నటి దీపిక పదుకొనె తుక్డే తుక్డే గ్యాంగ్‭కు మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె దుస్తులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అలాగే పాటను డర్టీ మైండ్‭సెట్‭తో తెరకెక్కించారు. పాటలోని సీన్లు, కాస్ట్యూమ్స్ సరి చేయాలి. అలా చేయకపోతే మధ్యప్రదేశ్‭లో సినిమాను అనుమతించాలా వద్దా అని ఆలోచించాల్సి ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు. ఇక ఈ పాటలో దీపిక కాషాయం రంగు బట్టలు వేసుకోవడం, షారూఖ్ ముదురు రంగు బట్టలు వేసుకోవడాన్ని సైతం ఆయన ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ఆ రంగుల్ని సైతం మార్చాలని మంత్రి నరోత్తమ్ మిశ్రా డిమాండ్ చేశారు.