లాక్‌డౌన్ టైంలో షారుఖ్ ఖాన్ నుంచి క్రిస్టియానో రొనాల్డో వరకు సెలబ్రిటీల మిలియన్ డాలర్ల రాజప్రసాదాలు ఎలా ఉన్నాయో చూస్తారా?

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 12:26 PM IST
లాక్‌డౌన్ టైంలో షారుఖ్ ఖాన్ నుంచి క్రిస్టియానో రొనాల్డో వరకు సెలబ్రిటీల మిలియన్ డాలర్ల రాజప్రసాదాలు ఎలా ఉన్నాయో చూస్తారా?

Updated On : April 27, 2020 / 12:26 PM IST

ఈ లాక్‌డౌన్‌తో మనం, సెలబ్రెటీలు అందరు ఇళ్లకే పరిమితం. మనకు లాక్‌డౌన్ అంటే ఇబ్బందికాని… సెలబ్రిటీలదేముంది? పెద్ద పెద్ద బిల్డింగ్‌లు…సర్వహంగులు..అసలు ప్రపంచమే వాళ్ల ఇంటిలో ఉంటుంది. ఈ సంగతితెలిసినా, మా తారాలోకం ఎలా ఉందోనని అభిమానులు తెగ టెన్షన్ పడుతుంటారు. కిచిన్‌లో వంటచేస్తూ కనిపిస్తే…వాళ్లు మనలాంటివాళ్లేనని అనుకొంటారు. సంబరిపడిపోతారు.

మన సెలబ్రిటీలు బిలీనియర్లు. షారుఖ్ ఖాన్ నుంచి ప్రియాంకా చోప్రా వరకు చాలామందికి పదులు, వందల కోట్ల విలువచేసే రాజప్రసాదాలు (mansion) ఉన్నాయి. జిమ్, బాస్కెట్‌బాల్ కోర్టు, ప్రైవేట్ ఆడిటోరియం.. పెద్ద లిస్టే. కొందరి బిల్డింగ్‌లు tiktok బ్యాక్ డ్రాప్‌లైపోయాయి. అంత రిచ్…కాదు సూపర్ రిచ్ మరి.

champagnepapi కెనడియన్ రాపర్, గాయకుడు. లాక్‌డౌన్‌లో తన ఇంటిని  వీడియో రూపంలో చిత్రీకరించాడు. డ్రేక్ ఇల్లు , గదులు చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇది 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన లగ్జరీ బిల్డింగ్.  hand-cut Swarovski crystal light installation గది, ఇండోర్ బాస్కెట్ బాల్ కోర్టులు ఉన్నాయి. ఇక ఇంటీరియర్ డిజైన్స్ అంటారా? superstar persona తగ్గట్టుగానే.

Shah Rukh Khan :

కింగ్ ఖాన్..1920sనాటి Mumbai’s Bandraలోని Mannatలో లాక్‌డౌన్‌లో ఉన్నారు. personal auditorium , entertainment zones ఉన్నాయి.గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైనర్ కదా. అందుకే ఒక్కో గదిని డిఫరెంట్ థీమ్స్‌తో తీర్చిదిద్దారు.

Kim Kardashian West , Kanye West

Kardashiansతో ఉండటమమే చిన్న విషయంకాదు. ఆన్ స్క్రీన్ మీద  Kim, Kanye జంట మెరిసిపోతుంది. Kim Kardashian ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ స్టార్. ఆమె పిక్స్ వోల్డ్‌ను మొత్తం ఊపేస్తాయి. ఈ జంట హౌస్ మాత్రం చాలా సింపుల్. minimal, pristine white house. ఖరీదు 60 మిలియన్ డాలర్లు. ఇంటా బైటా… చాలా విశాలం.

Cristiano Ronaldo :

లాక్‌డౌన్‌లో క్రిస్టియానో రోనాల్డో  ఏం చేస్తున్నాడో Thesun బైటపెట్టింది. Madeiraలోని luxury villaలో ఫ్యామిలీతో కలసి ఉంటున్నాడు.  ఇది ఇల్లుఅనడంకన్నా… ఈనాటి కోట అంటే బెటరేమో. అక్కడ నుంచి చూస్తే  Atlantic Ocean కళ్లముందుంటుంది. rooftop pool, gym…ఒక్కటేంటి? రోనాల్డ్ భవంతకదా…అన్నీ హంగులూ ఉన్నాయి. అతని పిల్లలతో కలిసి ఆడుకోవటానికి ఎకరాలకొద్ది పచ్చనిమైదానమూ ఉంది.
 
Priyanka Chopra Jonas, Nick Jonas :

The global superstar  ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్‌తో కలిసి కాలిఫోర్నియాలోని విల్లాలో ఉంటున్నారు. Variety చెప్పినదాని ప్రకారం, కొండనుఅనుకుని ఉన్న ఈ విల్లా కోసం 20 మిలియన్ల డాలర్లను ఈ జంట ఖర్చుచేసింది. 20వేల చదరపు అడుగుల విస్తీర్ణం. 7 బెడ్ రూములు. గ్లోబల్‌గా పాపులర్ కాబట్టి.. ఆ రేంజ్ కు తగ్గట్టుగా, థియేటర్, ఇండోర్ బాస్కెట్ బాల్ కోర్టు, గేమ్స్ రూమ్, జిమ్…అన్నీ ప్రియాంకకు నచ్చినట్లుగానే ఉన్నాయి.

 Kylie Jenner :

కైలీ జెన్నర్ పాపులర్ రియాలటీ స్టార్. కాలిఫోర్నియాలోని హిడెన్ హిల్స్‌లోని 12 మిలియన్ డాలర్ల భవంతిలో రిలాక్స్ అవుతూ..ఏం సినిమాలో చూడాలో… అభిమానులను ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతుంది. swimming pool, a dedicated BBQ zone, an outdoor kitchen…అన్నీKylie Jenner రేంజ్‌కు తగ్గట్టుగానే.