Jawaan Song : షారుఖ్ నుంచి ఇలాంటి రొమాంటిక్ లవ్ సాంగ్ వచ్చి ఎన్నేళ్లయింది.. జవాన్ నుంచి ‘ఛలోనా’ సాంగ్ రిలీజ్..

తాజాగా జవాన్ సినిమా నుంచి ఓ లవ్ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేశారు. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లోనూ ఈ పాటను రిలీజ్ చేశారు.

Jawaan Song : షారుఖ్ నుంచి ఇలాంటి రొమాంటిక్ లవ్ సాంగ్ వచ్చి ఎన్నేళ్లయింది.. జవాన్ నుంచి ‘ఛలోనా’ సాంగ్ రిలీజ్..

Shah Rukh Khan Nayanathara Jawaan Movie Love Romantic Song Released it goes viral with Shahrukh Vintage looks

Updated On : August 14, 2023 / 12:45 PM IST

Jawaan Songs : షారుఖ్ ఖాన్(Shahrukh Khan) హీరోగా తమిళ దర్శకుడు అట్లీ(Atlee) దర్శకత్వంలో రాబోతున్న భారీ సినిమా జవాన్. ఇందులో నయనతార(Nayanathara) హీరోయిన్ గా, విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటిస్తున్నారు. ప్రియమణి, దీపికా పదుకొనే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జవాన్ సినిమాని సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాని దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో షారుఖ్ సొంతంగా తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నాడు.

ఇటీవల జవాన్ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ బాగా వైరల్ అయింది. ఇందులో షారుఖ్ పోరాటాలు, ఫుల్ యాక్షన్ సీక్వెన్స్.. ఇలా అన్ని మెప్పించాయి. దీంతో జవాన్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లవ్ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేశారు. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లోనూ ఈ పాటను రిలీజ్ చేశారు.

Operation Valentine : వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా టైటిల్ అదిరిందిగా.. ఆపరేషన్ వాలెంటైన్..

తెలుగులో చల్ చల్ ఛలోనా.. అనే సాగే ఈ లవ్ సాంగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సాంగ్ లో షారుఖ్, నయనతార మధ్య క్యూట్ రొమాంటిక్ లవ్ సీన్స్ కూడా ఉన్నాయి. షారుఖ్ మరింత యంగ్ గా కనిపించాడు. షారుఖ్ ఇలాంటి లవ్ రొమాంటిక్ సాంగ్ చేసి చాలా సంవత్సరాలైంది. దీంతో ఈ పాటలో వింటేజ్ షారుఖ్ కనిపించాడని అభిమానులు మురిసిపోతున్నారు. ఇక షారుఖ్ లేడి అభిమానులైతే ఎంత ముద్దొస్తున్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పాటతో సినిమాలో యాక్షన్ సీన్స్ మాత్రమే కాదు మంచి లవ్ రొమాంటిక్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి అని హింట్ ఇచ్చి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాడు అట్లీ.