Shah Rukh Khan : మహేష్ కోసం షారుఖ్.. నా ఫ్రెండ్ మహేష్ ‘గుంటూరు కారం’ అంటూ ట్వీట్..

తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గుంటూరు కారం సినిమా గురించి ట్వీట్ వేయడంతో ఇది వైరల్ గా మారింది.

Shah Rukh Khan Special Tweet on Mahesh Babu Guntur Kaaram Movie and shares Trailer Tweet goes Viral

Shah Rukh Khan : మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా నిన్న జనవరి 12న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పండక్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారంటున్నారు అభిమానులు. అమ్మ సెంటిమెంట్ తో మాస్ కమర్షియల్ అంశాలు జోడించి అదరగొట్టారు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, ఈశ్వరరావు.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇక గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ కూడా అదరగొడుతున్నాయి. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఒక రీజనల్ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేయడం ఇదే మొదటిసారి. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Hanuman : అమెరికాలో ‘హనుమాన్’ హవా.. తేజ సజ్జ మొదటి రికార్డ్..

తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గుంటూరు కారం సినిమా గురించి ట్వీట్ వేయడంతో ఇది వైరల్ గా మారింది. షారుఖ్ ఈ ట్వీట్ లో.. నా ఫ్రెండ్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చూడటానికి ఎదురు చూస్తున్నాను. ఒక మంచి యాక్షన్, ఎమోషన్, మాస్ సినిమా అని రాసి ట్రైలర్ కూడా షేర్ చేశారు. దీంతో మహేష్ అభిమానులు షారుఖ్ తమ హీరో సినిమా గురించి పోస్ట్ చేసారంటూ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ మరింత వైరల్ చేస్తున్నారు.