Tiger 3 : సల్మాన్ సినిమాలో షారుఖ్.. స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే..

సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ లో షారుఖ్ ఖాన్..

Tiger 3 : సల్మాన్ సినిమాలో షారుఖ్.. స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే..

Tiger 3

Updated On : December 24, 2021 / 2:38 PM IST

Tiger 3: బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు మీడియా అండ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమ అభిమాన హీరోలిద్దరూ కలిసి కనిపించబోతుండడంతో షారుఖ్, సల్మాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Bigg Boss 6 Telugu : నాగార్జున సరికొత్త ప్రయోగం.. 24 గంటల పాటు లైవ్!

సల్మాన్ ఖాన్, డైరెక్టర్ మనీష్ శర్మ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘టైగర్ 3’ (Tiger 3). ‘ఏక్ ధా టైగర్’ (Ek Tha Tiger), ‘టైగర్ జిందా హై’ (Tiger Zinda Hai) తర్వాత ‘టైగర్’ ఫ్రాంచైజీలో వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గత రెండు సినిమాల్లోనూ సల్మాన్‌ను రా ఏజెంట్‌గా చూపిస్తూ సిల్వర్ స్క్రీన్ మీద యాక్షన్ సీక్వెన్స్‌ని నెక్స్ట్ లెవల్‌లో చూపించారు దర్శకులు. ‘ఏక్ ధా టైగర్’ కి కబీర్ ఖాన్, ‘టైగర్ జిందా హై’ కి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు.

Atrangi Re : టాక్ సూపర్‌హిట్.. కానీ అదొక్కటే మైనస్..

‘టైగర్ 3’ లో షారుఖ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. అది కూడా రా ఏజెంట్ కావడం విశేషం. ఇందుకోసం 12 రోజుల కాల్షీట్ ఇచ్చాడట. అంథేరిలోని యశ్ రాజ్ స్టూడియోలో ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. సల్మాన్ పక్కన కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ పాకిస్థాన్ ఐఎస్ఐ స్పై క్యారెక్టర్ చేస్తున్నారు.

Arjuna Phalguna : ట్రైలర్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని బాగానే వాడారుగా..