Shah Rukh Khan : మీరు ఆస్కార్‌ని తెచ్చినప్పుడు నన్ను దాన్ని టచ్ చేయనివ్వండి.. చరణ్‌కి షారుఖ్ ట్వీట్!

బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్.. రామ్ చరణ్ కి చేసిన ట్వీట్ అందర్నీ ఆకర్షిస్తుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హాలీవుడ్ నగరంలో సందడి చేస్తున్నాడు. కాగా ఇవాళ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని రామ్ చరణ్ విడుదల చేశాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఉండి కూడా ట్రైలర్ రిలీజ్ కి టైం కేటాయించడంతో..

Shah Rukh Khan : మీరు ఆస్కార్‌ని తెచ్చినప్పుడు నన్ను దాన్ని టచ్ చేయనివ్వండి.. చరణ్‌కి షారుఖ్ ట్వీట్!

Shah Rukh Khan tweet to ram charan is gone viral

Updated On : January 10, 2023 / 4:20 PM IST

Shah Rukh Khan : బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్.. రామ్ చరణ్ కి చేసిన ట్వీట్ అందర్నీ ఆకర్షిస్తుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హాలీవుడ్ నగరంలో సందడి చేస్తున్నాడు. ప్రెజెంట్ ఆస్కార్ నామినేషన్స్ లో భాగంగా RRR మూవీని లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ థియేటర్ లో స్క్రీన్ చేస్తున్నారు. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రేస్ లో కూడా ఈ సినిమా నిలవడంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ హోమ్ అఫ్ హాలీవుడ్ కి చేరుకున్నారు. అక్కడ ఓటర్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తూ ఆర్ఆర్ఆర్ ని ప్రమోట్ చేస్తున్నాడు.

Ram Charan : రామ్‌చరణ్‌కి ప్రత్యేకంగా ‘వరిసు’ ప్రీమియర్ వేయించిన విజయ్..

కాగా ఇవాళ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని రామ్ చరణ్ విడుదల చేశాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఉండి కూడా ట్రైలర్ రిలీజ్ కి టైం కేటాయించడంతో షారుఖ్ తన ట్విట్టర్ ద్వారా చరణ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ‘మీ RRR టీం ఆస్కార్ అవార్డుని ఇంటికి తెచ్చినప్పుడు ఒక్కసారి నన్ను దానిని టచ్ చేయనివ్వండి’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక విడుదలైన పఠాన్ ట్రైలర్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నిండిపోయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొణే నటిస్తుంది. జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాడు. జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ మూవీ మత సంఘాలు, సినీ, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతని ఎదురుకుంటుంది.