బాలీవుడ్ బంటీ.. ఇద్దరిలో ఎవరు?

‘అల వైకుంఠపురములో’.. హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ నటించనున్నారని బాలీవుడ్ సమాచారం..

  • Published By: sekhar ,Published On : April 9, 2020 / 12:57 PM IST
బాలీవుడ్ బంటీ.. ఇద్దరిలో ఎవరు?

Updated On : April 9, 2020 / 12:57 PM IST

‘అల వైకుంఠపురములో’.. హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ నటించనున్నారని బాలీవుడ్ సమాచారం..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘అల వైకుంఠపురములో’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై హైయ్యెస్ట్ కలెక్షన్లతో నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడీ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ కానుంది.

Ala Vaikunthapurramuloo

కిలాడీ అక్షయ్ కుమార్, యంగ్ హీరో షాహిద్ కపూర్ ఈ రీమేక్ రేసులో ఉన్నారు. అక్షయ్ ‘కాంచన’ రీమేక్ ‘లక్ష్మీబాంబ్’ తో పాటు దాదాపు అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు.  లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం అల్లు అర్జున్ పాత్ర షాహిద్ చేయనున్నాడని సమాచారం. ‘బంటు’గా బన్నీ తన నటనతో, డ్యాన్స్ అండ్ ఫైట్స్‌తో ఆకట్టుకుని కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’లో షాహిద్ నటించగ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే.

Read Also : త్రిష తప్పుకుందని తెలిసి షాకయ్యాను.. అసలు కారణం చెప్పిన చిరు..

Shahid Kapoor to Star in Ala Vaikunthapurramuloo Hindi Remake

ప్రస్తుతం నాని ‘జెర్సీ’ రీమేక్‌లో నటిస్తున్నాడు షాహిద్. ఎప్పటినుండో ఫ్యామిలీ ఓరియంటెండ్ సినిమా చేయాలనుకుంటున్న షాహిద్ ‘అల వైకుంఠపురములో’ రీమేక్‌లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ప్రముఖ నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ రీమేక్‌పై త్వరలో క్లారిటీ రానుంది.