Dunki Teaser : షారుఖ్ బర్త్ డే స్పెషల్.. ‘డుంకి’ టీజర్ రిలీజ్?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'డుంకి' (Dunki). 3 ఇడియట్స్, PK, సంజు వంటి బ్లాక్ బస్టర్స్ ని అందించిన రాజ్ కుమార్ ఇప్పుడు షారుఖ్ తో 'డుంకి'ని తెస్తున్నారు.

Shahrukh Khan Birthday Special Dunki Teaser Will Plan to Release
Dunki Teaser : వరుసగా ఫ్లాప్స్ లో ఉన్న బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) ఈ ఏడాది పఠాన్ (Pathaan), జవాన్ (Jawan) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టి 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టారు. దీంతో షారుఖ్ ఫామ్ లోకి రావడమే కాక బాలీవుడ్ కి కూడా పూర్వ వైభవం తీసుకొచ్చాడు. ఇదే సక్సెస్ ని కంటిన్యూ చేయడానికి ఈ ఏడాదే ఇంకో భారీ సినిమాతో రాబోతున్నాడు షారుఖ్.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘డుంకి’ (Dunki). 3 ఇడియట్స్, PK, సంజు వంటి బ్లాక్ బస్టర్స్ ని అందించిన రాజ్ కుమార్ ఇప్పుడు షారుఖ్ తో ‘డుంకి’ని తెస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుందని ఇటీవల ప్రకటించారు. డిసెంబర్ 22 ప్రభాస్ సలార్ సినిమా ఉందని తెలిసిందే. మొదట ఆ డేట్ ఇచ్చినా తర్వాత ఒక రోజు ముందుకి వెళ్లారు. ‘డుంకి’ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని షారుఖ్ వెయిట్ చేస్తున్నారు.
Also Read : Anil Ravipudi : భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి నెక్స్ట్ ఏంటి? మళ్ళీ ఆ హీరోతోనే?
ఇక నవంబర్ 2న షారుఖ్ పుట్టిన రోజు ఉండటంతో ఆ రోజు ‘డుంకి’ టీజర్ ని రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సెన్సార్ బోర్డు దగ్గర ‘డుంకి’ టీజర్ స్క్రీనింగ్ అయిందని సమాచారం. రెండు టీజర్స్ కట్ చేశారని. అందులో ఒకటి రేపు షారుఖ్ బర్త్ డే రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. టీజర్ 1 నిమిషం పాటు ఉండనుందని సమాచారం. దీంతో అభిమానులు ‘డుంకి’ టీజర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
#ShahRukhKhan's #Dunki teaser CONFIRMED for November 2nd.
There are two #DunkiTeaser certified as of now with length 58 secs and 109 secs correspondingly.
This is clashing with pan India Star #Prabhas' #Salaar on… pic.twitter.com/URbniVBbsu
— Manobala Vijayabalan (@ManobalaV) October 30, 2023