Pathaan : ఉగాదికి 1000 కోట్ల పఠాన్ గ్రాండ్ రిలీజ్.. ఏ ఓటీటీలోనో తెలుసా?
ఇన్ని రోజులు థియేటర్స్ లో సందడి చేసిన పఠాన్ ఇటీవలే 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లు థియేటర్స్ లో రికార్డులు బద్దలుకొట్టిన పఠాన్ ఇప్పుడు ఓటీటీలో రికార్డులు సృష్టించడానికి రెడీ అయింది...................

Shahrukh Khan Pathaan movie streaming in Amazon OTT from Ugadi
Pathaan : షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో వచ్చిన పఠాన్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో 1030 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి షారుఖ్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్న బాలీవుడ్ కి కూడా హిట్ సినిమా ఇచ్చాడు షారుఖ్. ఈ సినిమా విజయంతో బాలీవుడ్ అంతా పండగ చేసుకుంది.
ఇన్ని రోజులు థియేటర్స్ లో సందడి చేసిన పఠాన్ ఇటీవలే 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లు థియేటర్స్ లో రికార్డులు బద్దలుకొట్టిన పఠాన్ ఇప్పుడు ఓటీటీలో రికార్డులు సృష్టించడానికి రెడీ అయింది. ఇటీవల చాలా సినిమాలు రిలీజ్ అయిన నెల రోజులలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. పఠాన్ పెద్ద సినిమా అవ్వడం, భారీ హిట్ కొట్టడం, భారీ కలెక్షన్స్ రాబట్టడంతో పఠాన్ సినిమా 50 రోజులు అయ్యేవరకు వరకు ఆగింది. ఇప్పుడు పఠాన్ సినిమాని ఉగాది సందర్భంగా మార్చ్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయబోతున్నారు.
గతంలోనే పఠాన్ సినిమా తమ ఓటీటీలో రాబోతున్నట్టు అమెజాన్ ప్రకటించినా డేట్ మాత్రం చెప్పలేదు. తాజాగా ఉగాది సందర్భంగా మార్చ్ 22 నుంచి పఠాన్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవ్వబోతుందని అధికారికంగా ప్రకటించారు. పఠాన్ సినిమా హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనుంది. దీంతో షారుఖ్ అభిమానులు మరోసారి పఠాన్ ని చూడటానికి రెడీ అయిపోయారు. థియేటర్స్ లో కోట్లు కొల్లగొట్టిన పఠాన్ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు సాధిస్తుందో చూడాలి.
we sense a turbulence in the weather, after all Pathaan is coming!#PathaanOnPrime, Mar 22 in Hindi, Tamil and Telugu @iamsrk @deepikapadukone @TheJohnAbraham #SiddharthAnand @yrf pic.twitter.com/MnytnUqZEj
— prime video IN (@PrimeVideoIN) March 20, 2023