నటి రాగిణి తర్వాత ఎవరు..?..,శాండల్‌వుడ్‌ సెలబ్రెటీల్లో వణుకు

  • Published By: madhu ,Published On : September 5, 2020 / 07:32 AM IST
నటి రాగిణి తర్వాత ఎవరు..?..,శాండల్‌వుడ్‌ సెలబ్రెటీల్లో వణుకు

Updated On : September 5, 2020 / 7:57 AM IST

#SandalwoodDrugScandal కర్నాటక ఫిల్మ్ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది..నటి రాగిణి ద్వివేది ఇంట్లో సోదాలు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కీలక ఆధారాలు లభించడంతో ఆమెని అరెస్ట్ చేసారు. దీంతో బాలీవుడ్‌ నుంచి బిగినైన ఈ చిచ్చు ఇప్పుడు శాండల్‌వుడ్ సెలబ్రెటీల్లో వణుకు పుట్టిస్తోంది. రంగులలోకం చిత్రరంగం..ఇక్కడ డ్రగ్స్ విచ్చలవిడిగా చలామణీ అవుతాయన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి..




అయితే..బాలీవుడ్‌ హీరో సుశాంత్ డెత్ తర్వాత..ఒక్కసారిగా రాష్ట్రాల వారీగా కలకలం రేగుతోంది. ముంబైలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తన సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా..దాని వేర్లు బెంగళూరులో తేలాయి. జర్నలిస్ట్ కమ్ ప్రొడ్యూసర్ ఇంద్రజిత్ లంకేష్‌ని క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కర్నాటక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా బాంబ్ పేలింది.
https://10tv.in/sunny-leone-makes-it-to-top-of-merit-list-for-admission-in-kolkata-college/



ఆయన కనీసం 15 మంది ఇండస్ట్రీ ప్రముఖుల పేర్లను సిసిబికి ఇవ్వడంతో ఇక తీగె లాగడం ప్రారంభమైంది..అందులో ముందుగా రాగిణి ద్వివేదిని పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించేసరికి చుక్కలు కనిపించాయి. క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నటి రాగిణికి ముందుగానే నోటీసులు ఇచ్చినా తనకి సమయం చాలదని..ఆరోగ్యం బాలేదంటూ దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది..ఈ లోపుగానే కోర్టు ద్వారా ఎంక్వైరీ స్కిప్ చేసే ప్రయత్నం చేశారు.



శుక్రవారం పోలీసులు అచ్చంగా సినిమా ఫక్కీలోనే ఆమె ఇంట్లో ఎంట్రీ ఇచ్చారు..కోర్టు సెర్చ్ వారంట్ చూపించి మరీ సోదాలు చేయడంతో పాటు..ఆమెకి సంబంధించిన నాలుగు మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు..దీంతో రాగిణి ద్వివేది‌ని పోలీసులు లిటరల్‌గా బ్లాక్ చేసారని చెప్పాలి. రాగిణి ఫోన్ కాల్స్…వాట్సాప్ డేటా అంతా క్షుణ్ణంగా పరిశీలించారు.




నటి రాగిణి ఎంక్వైరీ ముందే ఆమె సన్నిహితుడు రవిశంకర్‌ని అరెస్ట్ చేసారు..మరోవైపు ఇదే కేసులో నటి అనిక కూడా అరెస్ట్ అయింది..వీరిద్దరి వాంగ్మూలంతో పాటు..ఇంద్రజిత్ లంకేష్ స్టేట్‌మెంట్‌తో ఇక కర్నాటక చిత్రరంగంలో కనీసం 15 మందిని సిసిబి ఎంక్వైరీ చేయడం ఖాయంగా తెలుస్తోంది.