చిరు మిస్ అయినా చరణ్ ఛాన్స్ కొట్టేశాడు!

చిరు మిస్ అయినా చరణ్ ఛాన్స్ కొట్టేశాడు!

Updated On : February 12, 2021 / 7:45 PM IST

Shankar and Ram Charan: మెగా స్టార్ ముచ్చట పడ్డారు కానీ కాలం కలిసి రాలేదు.. ఎందుకో చిరు-శంకర్‌లో కాంబినేషన్ తెరమీదకు రాలేదు.. కానీ మెగా పవర్ స్టార్ ఇప్పుడు మెగాస్టార్ ముచ్చట తీర్చబోతున్నారు.

ఇండియాలో టాప్ డైరెక్టర్‌గా పేరొందిన శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాజుకి 50వ సినిమా కాగా చెర్రీకిది 15వ సినిమా. ఈ క్రేజీ కాంబోపై టాలీవుడ్, కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

వాస్తవానికి శంకర్‌తో సినిమా చెయ్యాలని చిరు ఎప్పటినుండో అనుకుంటున్నారు. ‘రోబో’ ఫంక్షన్‌లో స్వయంగా చిరునే నాతో సినిమా చెయ్యండని శంకర్‌ని అడిగారు.. వీరి కాంబో పలుసార్లు వార్తల్లోకి వచ్చినా ఎందుకో సెట్ కాలేదు. కట్ చేస్తే ఇప్పుడు చిరు తనయుడు చరణ్, శంకర్‌తో సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ కాకపోయినా ఆయన నట వారసుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, శంకర్‌తో సినిమా చేస్తుండడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Shankar and Ram Charan