Shankar To Direct Biggest Pan India Movie With Shah Rukh Khan And Vijay
Shankar: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. నిన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ చార్మినార్ వద్ద జరుగుతుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, నేడు ఈ సినిమా షూటింగ్ కర్నూల్‌లోని కొండారెడ్డి బురుజు వద్ద జరుగుతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
Director Shankar : చరణ్ సినిమా ఆపలేదు.. చరణ్, కమల్ సినిమాలు ఒకేసారి షూట్ చేస్తాను
ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమా తరువాత శంకర్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆసక్తిగా మారింది. కాగా, శంకర్ తన నెక్ట్స్ మూవీగా ఓ భారీ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, తమిళ స్టార్ హీరో విజయ్‌లతో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని శంకర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.
Director Shankar : భారతీయుడు 2 షూటింగ్ మొదలు.. మరి చరణ్ సినిమా పరిస్థితి ఏంటి?
అయితే షారుక్ చాలా కాలం తరువాత పఠాన్ మూవీతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆయనతో పాన్ ఇండియా మూవీ అంటే దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. కానీ, తమిళ హీరో విజయ్‌కు ఉత్తరాదిన పెద్దగా క్రేజ్ లేదు. మరి ఆయనతో పాన్ ఇండియా మూవీ అంటే అక్కడి ప్రేక్షకులు సినిమాను చూస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి నిజంగానే శంకర్ వీరిద్దరితో కలిసి భారీ పాన్ ఇండియా మూవీ చేస్తాడా.. లేక ఇదంతా కేవలం ట్రాష్ అని కొట్టిపారేస్తాడా అనేది చూడాలి.