Indian 2 : ఇండియన్ 2లో ఆ ఇద్దరి నటులను డైరెక్టర్ శంకర్ CGIలో చూపిస్తున్నాడట..

ఇండియన్ 2 సినిమాలో దర్శకుడు శంకర్ ఆ ఇద్దరి నటులను CGI రూపంలో చూపించాడట. అలా ఎందుకు చేశాడో తెలుసా..?

Indian 2 : ఇండియన్ 2లో ఆ ఇద్దరి నటులను డైరెక్టర్ శంకర్ CGIలో చూపిస్తున్నాడట..

shankar use CGI for Vivek and Nedumudi Venu in Indian 2

Updated On : July 17, 2023 / 9:56 PM IST

Indian 2 : కమల్ హాసన్ (Kamal Hasaan), శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. చాలా కాలం ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు శంకర్ అండ్ కమల్. ఇక ఈ మూవీలో హీరో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రియా భవానీ శంకర్‌, బాబీ సింహా, సముద్రఖని, తమిళ్ నటుడు వివేక్‌, మలయాళ నటుడు నెడుముడి వేణు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ చిత్రీకరణ విషయంలో ఏడాది పాటు బ్రేక్ లు పడ్డాయి.

Naga Babu : బేబీ నిర్మాత SKN, దర్శకుడు సాయి రాజేష్ జనసేన కోసం ఎంతో పని చేశారు..

ఈ బ్రేక్ సమయంలో సినిమాలో నటించిన వివేక్‌ అండ్ నెడుముడి వేణు కన్నుమూశారు. ఆల్రెడీ వీరిద్దరి పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. వాటిని మళ్ళీ వేరే నటుడిని పెట్టి రీ షూట్ చేయాలంటే తలకి మించిన భారం అవుతుందని దర్శకుడు శంకర్.. సీజీఐ (కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ) ద్వారా వారిద్దరి రూపాన్ని తెరపై చూపించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో వివేక్‌ అండ్ నెడుముడి సీజీఐ రూపంలో కనిపించనున్నారు.

Pranitha : మరోసారి భర్త పాదాలకు పూజ చేసి ఫెమినిస్టులకు గట్టి పంచ్ ఇచ్చిన ప్రణీత..

కాగా ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ అండ్ రెడ్ జెయింట్స్ బ్యానర్స్ కలిసి సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.