Bigg Boss 5 Telugu : ‘షన్నూ.. ఐ లవ్ యూ’.. దీప్తి సునయన సర్‌ప్రైజ్..

షణ్ముఖ్ జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా దీప్తి సునయన సర్‌ప్రైజ్ చేసింది..

Bigg Boss 5 Telugu : ‘షన్నూ.. ఐ లవ్ యూ’.. దీప్తి సునయన సర్‌ప్రైజ్..

Shanmukh Jaswanth

Updated On : September 16, 2021 / 3:27 PM IST

Bigg Boss 5 Telugu: ఎపిసోడ్ ఎపిసోడ్‌కి ‘బిగ్ బాస్ 5’ తెలుగు ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేస్తూ.. మంచి టీఆర్‌‌పీ రేటింగ్స్‌తో దూసుకెళ్తోంది. రెండో వారం నుంచి హౌస్‌లో సందడి పెరిగింది. ఇక కంటెస్టెంట్స్ చేస్తున్న హంగామా అయితే మామూలుగా లేదు.

Bigg Boss 5 Telugu : దీప్తితో ప్రేమలో షన్ను..!

ప్రతి సీజన్‌లో బిగ్ బాస్ ఇంట్లో ఎవరో ఒకరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతుంటుంది. ఇప్పటి కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్, గత సీజన్‌లో పార్టిసిపెట్ చేసిన దీప్తి సునయనల ప్రేమ వ్యవహారం బిగ్ బాస్ కారణంగా కన్ఫమ్ అయిపోయింది. ఇక నెట్టింట వీరి ఫ్యాన్స్ సందడి సందడి చేస్తున్నారు.

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్..?

గురువారం షణ్ముఖ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా దీప్తి సునయన తన ప్రియుడికి సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీప్తి.. ‘షన్నూ.. ఐ లవ్ యూ’ అని చెప్పగానే.. షణ్ముఖ్ సిగ్గుతో మొగ్గలేసేశాడు. తర్వాత ఇంటి సభ్యుల మధ్య షణ్ముఖ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. ప్రస్తుతుం ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.