Bigg Boss 5 : రెచ్చగొట్టిన షన్ను.. బయటకొచ్చి కొడతా అన్న సన్నీ..
సన్నీ నేను బయటకి వచ్చాక నీ పని చెప్తా ఆగు అని సీరియస్ అయ్యాడు. దీంతో షన్ను నాకిప్పటి నుంచే భయమేస్తుంది అని నవ్వాడు. భయపడ్డావు, కాబట్టే నన్ను లోపలేశావు అని కౌంటరిచ్చాడు

Bb5
Bigg Boss 5 : బిగ్ బాస్ లో రోజు రోజుకి గొడవలు పెరుగుతున్నాయి. ఈ సీజన్ లో గొడవలు తప్ప ఏమి కనిపించట్లేదు. ముఖ్యంగా సన్నీ అందరితో గొడవపడుతున్నాడు. కొన్ని కొన్ని సార్లు కావాలని మరీ గొడవ పడుతున్నాడు. దీంతో ఇంటి సభ్యులంతా సన్నీని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే సన్నీ వరస్ట్ పర్ఫార్మర్ గా జైలుకి వెళ్ళాడు. అయినా సన్నీ మారలేదు. జైలులో ఉండి కూడా నిన్న గొడవ పడ్డాడు.
Puneeth Rajkumar : పునీత్ కి ఉన్న చిరకాల కోరిక తీరేలోపే మరణం..
నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్లకు పూరీలు చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. యానీ మాస్టర్, శ్రీరామ్, విశ్వ, రవి, లోబో ఒక టీమ్ కాగా కాజల్ తరపున మిగిలినవారంతా మరో టీమ్. ఈ గేమ్‌లో కాజల్ టీమ్ ముందుగా 50 పూరీలు చేసినప్పటికీ అవి సరిగా లేవంటూ కెప్టెన్ షన్ను యానీ టీమ్‌ను విజేతగా ప్రకటించాడు. దీంతో గెలిచిన టీమ్ సభ్యులందరికీ ఏడాది పాటు వంటనూనె ఉచితంగా లభించే ఆఫర్ అందుకున్నారు. అయితే కాజల్ వాళ్లు కష్టపడి త్వరగా పూరీలు చేశారని సన్నీ జైల్లో నుంచి చెప్పాడు.
Puneeth Rajkumar : ఉదయం 4.30 గంటలకే ప్రారంభమైన పునీత్ అంతిమ యాత్ర
దీంతో యానీ కోపం తెచ్చుకొని.. బుద్ధుండాలి, మధ్యలో నీ జడ్జిమెంట్ ఏంటి? న్యూట్రల్‌గా మాట్లాడు, నీ ఫ్రెండ్స్ కష్టమే కనిపిస్తది, వేరేవాళ్ల కష్టం కనిపించదా? అని రెచ్చిపోయింది. ఈ గొడవ ఏకంగా సౌతిండియన్, నార్తిండియన్ అంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. గొడవ పెద్దది అవడంతో సన్నీ చెంపలేసుకున్నాడు. అయితే వీళ్లిద్దరికీ గొడవ జరుగుతుంటే షన్ను నవ్వాపుకోలేకపోయాడు. ఒకపక్క హౌస్ అంతా ఆవేశంతో ఊగిపోతుంటే కెప్టెన్ మాత్రం దాన్ని ఎంజాయ్ చేస్తూ నవ్వడమేంటని ఫైర్ అయ్యాడు సన్నీ. హౌస్‌లో కొందరు బాధపడుతుంటే నీకు నవ్వొస్తుంది, అది తప్పు అని చెప్పాడు. ఆ మాటలను పెద్దగా పట్టించుకోని షన్ను నవ్వును కంటిన్యూ చేస్తూ సన్నీని మరింత రెచ్చగొట్టాడు. దీంతో సన్నీ నేను బయటకి వచ్చాక నీ పని చెప్తా ఆగు అని సీరియస్ అయ్యాడు. దీంతో షన్ను నాకిప్పటి నుంచే భయమేస్తుంది అని నవ్వాడు. భయపడ్డావు, కాబట్టే నన్ను లోపలేశావు అని కౌంటరిచ్చాడు సన్నీ. దీంతో అతడిని మరింత రెచ్చగొడుతూ షన్ను అయితే కొట్టు మరి వెయిట్ చేస్తున్నా అని సీరియస్ అయ్యాడు. ఇదంతా చూసి ప్రేక్షకులు ఓ పక్కన సన్నీని తిడుతూనే ఈ సారి గొడవలు తప్ప బిగ్ బాస్ లో ఏమి కనిపించడంలేదు అంటున్నారు.