Shantala : పీరియాడిక్ మూవీ ‘శాంతల’ నుంచి రెండో పాట విడుదల.. కింగ్ నాగార్జున చేతుల మీదుగా..

తాజాగా ఈ చిత్రం యొక్క రెండో పాట.. 'చెలి మొహమే..' పాటను హీరో కింగ్ నాగార్జున(Nagarjuna) విడుదల చేశారు.

Shantala : పీరియాడిక్ మూవీ ‘శాంతల’ నుంచి రెండో పాట విడుదల.. కింగ్ నాగార్జున చేతుల మీదుగా..

Shantala Movie Second Song Released by Nagarjuna

Updated On : November 3, 2023 / 3:42 PM IST

Shantala Movie Song : ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతకం పై కె ఎస్ రామారావు గారి సమర్పణలో అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ అశ్లేషా ఠాకూర్ ప్రధాన పాత్ర లో నీహల్ హీరోగా, ఆశ్లేష హీరోయిన్ గా శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం శాంతల. ఈ సినిమా నుంచి మొదటి పాటను ప్రముఖ దర్శకుడు, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) విడుదల చేసారు.

తాజాగా ఈ చిత్రం యొక్క రెండో పాట.. ‘చెలి మొహమే..’ పాటను హీరో కింగ్ నాగార్జున(Nagarjuna) విడుదల చేశారు. పాటను వీక్షించి నాగార్జున చిత్రయూనిట్ కి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. మా శాంతల చిత్రం లోని రెండో పాటని కింగ్ నాగార్జున గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. వారికి మా కృతజ్ఞతలు అని తెలిపారు.

Shantala Movie Second Song Released by Nagarjuna

ఇక ఈ చెలి మొహమే.. పాటను ఎస్ పి బి చరణ్ పాడారు. కృష్ణ కాంత్ గారు సాహిత్యం అందించారు. ఈ సినిమాని హళిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా చిత్రీకరిస్తున్నారు. నవంబర్ 17 తారీకున విడుదల అవుతుంది అని తెలియజేసారు. సీతారామం వంటి సూపర్ హిట్ చిత్రానికి సంగీతం సమకూర్చిన విశాల్ చంద్రశేఖర్ శాంతల చిత్రానికి సంగీతం అందించారు.

Also Read : Narakasura Movie Review : నరకాసుర మూవీ రివ్యూ.. పలాస హీరో మళ్ళీ హిట్ కొట్టాడా?