Narakasura Movie Review : నరకాసుర మూవీ రివ్యూ.. పలాస హీరో మళ్ళీ హిట్ కొట్టాడా?

'పలాస' (Palasa) సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) చాలా గ్యాప్ తర్వాత 'నరకాసుర' సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

Narakasura Movie Review : నరకాసుర మూవీ రివ్యూ.. పలాస హీరో మళ్ళీ హిట్ కొట్టాడా?

Rakshit Atluri Narakasura Movie Review and Rating

Updated On : November 3, 2023 / 7:30 PM IST

Narakasura Movie Review : ‘పలాస'(Palasa) సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి(Rakshit Atluri) చాలా గ్యాప్ తర్వాత ‘నరకాసుర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సెబాస్టియన్ నోవా అకోస్టా దర్శకత్వంలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన నరకాసుర సినిమా నేడు నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో కూడా ‘నరకాసుర’ నేడు రిలీజ్ అయింది.

కథ విషయానికి వస్తే..
తమిళనాడు – ఆంధ్ర బోర్డర్ లో కాఫీ, మిరియాలు పండించే ఓ గ్రామంలో జరిగే కథ. శివ(రక్షిత్) లోడ్లు తీసుకెళ్లే లారీ డ్రైవర్ గా కాఫీ ఎస్టేట్ ఓనర్ ఆరుముగం(నాజర్) దగ్గర పనిచేస్తూ ఉంటాడు. హీరో తన పని చేసుకుంటూ గ్రామం వాళ్ళతో, తన కుటుంబం, తన మరదలు మీనాక్షి(అపర్ణ జనార్థన్)తో సరదాగా గడుపుతూ ఉంటాడు. ఆ ఏరియాలో ఉండే రాజకీయ నాయకుడు నాగమ నాయుడు(చరణ్ రాజ్)కి శివ అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తాడు. అనుకోకుండా శివ ఓ రోజు అదృశ్యమవుతాడు. అక్కడ్నుంచి కథ ట్విస్టులతో కథ సాగుతుంది. ట్రాన్స్ జెండర్స్ ప్రత్యేకంగా అండ్ ప్రదేశంలోకి శివ వెళ్తే ముందు వాళ్ళని అసహ్యించుకున్నా శివ వాళ్ళ గురించి తెలుసుకొని వారి కోసం ఎందుకు పోరాడాడు? నాగమ నాయుడు తనయుడు, అతని మనుషులు శివ ఫ్యామిలీ, అతని మనుషుల మీద ఎందుకు దాడి చేశారు? శివ మరదలిని ఎందుకు చంపారు? శివ ట్రాన్స్ జెండర్స్ తో కలిసి ఏం చేశాడు అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా, టెక్నికల్ అంశాల విశ్లేషణ
సినిమా మొదట కాసేపు మాములు కథలా, ప్రేమ కథలా సాగినా శివ అదృశ్యం తర్వాత నుంచి ఆసక్తికరంగా మారయితుంది. ట్రాన్సజెండర్స్ ఎంట్రీ నుంచి సినిమాకు మరింత బలం చేకూరుతుంది. ప్రతి ఫ్రేమ్ ని చాలా అందంగా చూపించారు కెమెరామెన్. తమిళ్ లో రా అండ్ రస్టిక్ సినిమాలు వస్తాయని మాట్లాడుకుంటాం. ఈ సినిమా కూడా అలాంటి సినిమానే. సినిమాలో శివుడి గురించి, శివ తత్వం గురించి అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంటుంది. సెకండ్ హాఫ్, ట్రాన్స్ జెండర్స్ చేసే యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. సినిమాకి మ్యూజిక్ చాలా కొత్తగా ఉంటుంది. ఎక్కువగా ఆలయాల్లో వినిపించే దేవుడికి సంబంధించిన మ్యూజిక్ ని వాడారు.

యాక్షన్ సన్నివేశాల్లోను ఇలాంటి మ్యూజిక్ వాడి గూస్ బంప్స్ తెప్పించారు. క్లైమాక్స్ ఫైట్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. క్లైమాక్స్ లో కెమెరా విజువల్స్, షాట్స్ కూడా కొత్తగా ఉంటాయి. కథ మాములు రివెంజ్ స్టోరీ అయినా దానికి ఒక ట్రాన్స్ జెండర్స్ మెసేజ్ అంతర్లీనంగా జతచేసి కొత్తగా చూపించడానికి ప్రయత్నించాడు డైరెక్టర్. స్క్రీన్ ప్లే మాత్రం కొద్దిగా నాన్ లీనియర్ గా ఉండటంతో అక్కడక్కడా ప్రేక్షకుడు కన్ఫ్యూజన్ కి గురవుతాడు. ఇక ఈ సినిమా ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అందమైన లొకేషన్స్ లో షూట్ చేయడంతో లొకేషన్స్ చూస్తుంటే న్యాచురాలిటీ ఫీలింగ్ కలుగుతుంది.

Also Read : Keeda Cola Movie Review : కీడాకోలా మూవీ రివ్యూ.. తరుణ్ భాస్కర్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడా?

నటీనటుల విషయానికి వస్తే.. రక్షిత్ పలాస సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో నటనలో ఇంకో మెట్టు ఎక్కడానే చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. హీరోయిన్స్ ఇద్దరూ పల్లెటూరి అమ్మాయిల్లా బాగా చేశారు. హీరోయిన్ ని బురదలో పడేసి చంపడానికి ప్రయత్నించే సీన్ లో నిజంగా చేసి జీవించిందనే చెప్పొచ్చు. చరణ్ రాజ్ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి తన నటనతో మెప్పించారు. శత్రు ట్రాన్స్ జెండర్స్ కి అధినేతగా శివుడి భక్తుడిగా సరికొత్త పర్ఫార్మెన్స్ చూపించాడు. నాజర్, తేజ్, శ్రీమాన్.. పలువురు నటులు తమ పాత్రలలో మెప్పించారు.

మొత్తంగా నరకాసుర టైటిల్ కి కథకి సంబంధం లేకపోయినా చెడుని అంతమొందించాలనే కథాంశానికి యాప్ట్ చేసుకోవచ్చు. ఈ సినిమాకు రేటింగ్ 2.75 వరకు ఇవ్వొచ్చు.

గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే