Sakshi Movie : కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరో.. నాగబాబు విలన్.. ‘సాక్షి’ సినిమా రివ్యూ..

సీనియర్ నరేష్ బావ కుమారుడు శ‌రణ్ కుమార్ కూడా గతంలో హీరోగా ఒక సినిమా చేశాడు. తాజాగా సాక్షి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Sakshi Movie : కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరో.. నాగబాబు విలన్.. ‘సాక్షి’ సినిమా రివ్యూ..

Sharan Kumar Nagababu Sakshi Movie Review and Rating

Sakshi Movie Review :  ఇప్పటికే సూపర్‌స్టార్ కృష్ణ‌ ఫ్యామిలీ నుంచి అనేక మంది నటులు ఇండస్ట్రీలో ఉన్నారు. సీనియర్ నరేష్ బావ కుమారుడు శ‌రణ్ కుమార్ కూడా గతంలో హీరోగా ఒక సినిమా చేశాడు. తాజాగా సాక్షి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ఆర్యూ రెడ్డి -బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా మునగాల సుధాక‌ర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:
అర్జున్(శరణ్ కుమార్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. తన ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి ఒక పర్సనల్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా అతనికి రిపోర్టర్ అయిన నేత్ర(జాన్వీర్ కౌర్) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే మరోపక్క సీఎం(ఇంద్రజ) అవినీతిని ఆమె తండ్రికి బట్టబయలు చేసే క్రమంలో అర్జున్ తండ్రి(దేవీ ప్రసాద్) ఒకరోజు రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. బతికించుకోవాలని అనుకుంటే లక్షలు అవుతాయని తెలిసి గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధం అవుతాడు. అయితే అనుకోకుండా మర్డర్ కేసులో ఇరికించబడతాడు. మరి ఈ గంజాయి స్మగ్లింగ్ ట్రాప్ లో అర్జున్ ను ఇరికించింది ఎవరు? మర్డర్ కేసుల నుంచి అర్జున్ బయట పడతాడా? ఈ విషయంలో త్రిపాఠి(నాగబాబు) ఏం చేశాడు? చివరికి అసలు అర్జున్, నేత్ర ఒక్కటయ్యారా? అనేదే సినిమా కథ.

నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే మొదటి సినిమాతో పోలిస్తే శరన్ కుమార్ నటనలో పరిణితి కనిపించింది. జాన్వీర్ కౌర్ కి సినిమాలో కేవలం అందం కోసమే కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. విలన్ గా నటించిన నాగబాబు ఇతర సీనియర్ నటులతో పోటీపడి నటించారు. అజయ్, ఇంద్రజ, దేవీ ప్రసాద్ వంటి వారు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీకల్ టీమ్:
కథ పరంగా చూస్తే రొటీన్ అనిపించినా కొత్తగ చూపించడానికి ట్రై చేశాడు డైరెక్టర్. రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులే చిల్లర పంచాయితీలు చేస్తూ తమ తమ భుక్తి కోసం ప్రజలను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని దోచుకుంటే ఒక నిస్వార్ధ జర్నలిస్టు తండ్రి కోసం కొడుకు చేసే ధర్మ యుద్ధమే ఈ సినిమా. సినిమా ఓపెనింగ్ లోనే సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచేసిన డైరెక్టర్ నెమ్మదిగా కథలోకి తీసుకు వెళ్ళాడు. ఇక లవ్ ట్రాక్ తక్కువగానే అనిపించినా గంజాయి స్మగ్లింగ్ కి హీరో రెడీ అయ్యాక కథలో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకుని సెకండ్ హాఫ్ నుంచి అనేక ట్విస్టులు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. మొత్తంగా ఈ సినిమాతో కొన్ని సీరియస్ సమస్యలను టచ్ చేసి ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేశారు. దర్శకుడిగా శివ కేశ‌న కుర్తి తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసి కొంత వరకు సక్సెస్ అయ్యాడు. ఇక ప్రస్తుతం ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి మంచి సంగీతం ఇచ్చాడు. సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టాడు.

Yamudu : నరలోకం వదిలి యముడు భూలోకానికి వస్తే.. అక్కడి శిక్షలు ఇక్కడ వేస్తే? యముడు గ్లింప్స్ రిలీజ్..

ఫైనల్ గా చెప్పాలంటే సీరియస్ సమస్యలను ఆలోచింపచేసేలా ప్రశ్నించే సినిమా ఈ సాక్షి.