Aadavallu Meeku Joharlu Teaser
Aadavaallu Meeku Joharlu: రోజులు దగ్గర పడుతుంటే.. శర్వా అండ్ బ్యాచ్ క్రేజీగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. భీమ్లానాయక్ తో పోటీ వద్దనుకుని వారం లేట్ గా థియేటర్స్ కొస్తున్న ఆడవాళ్లు.. సినిమాలో విషయం అదిరిందని చెప్తున్నారు. ప్రమోషన్ మెటీరియల్ గా రష్మికను బాగానే వాడేస్తున్నారు. ఇక ఈమధ్యే ఈ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ సుకుమార్ కూడా ఆడవాళ్ల కోసం రంగంలోకి దిగారు.
Aadavaallu Meeku Joharlu: లక్కీ గర్ల్ రష్మిక.. శర్వాకి లక్ కలిసి వస్తుందా?
ఈ శుక్రవారమే కొత్త సినిమాతో థియేటర్స్ కి రాబోతున్నాడు శర్వానంద్. పుష్ప క్రష్మిక.. రష్మిక శర్వాతో కలిసి అతిత్వరలో సందడి చేయబోతుంది. ముందు రిలీజైన భీమ్లానాయక్.. వెనుక రాబోతున్న రాధేశ్యామ్ ధాటిని తట్టుకుని నిలబడేందుకు ఆడవాళ్లు మీకు జోహార్లు టీమ్ గట్టిగానే ట్రై చేస్తోంది. అందులో భాగంగానే పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పారన్న సీక్రెట్ ను రీసెంట్ గా రివీల్ చేశారు.
Aadavallu Meeku Joharlu: టైటిల్ సాంగ్ రిలీజ్.. దేవిశ్రీ మార్క్ కిర్రాక్ అంతే!
ఈమధ్యే ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జోష్ చూపించారు సుకుమార్. ఇప్పుడీ సినిమాలో భాగమై డైరెక్టర్ కిషోర్ తిరుమలను సపోర్ట్ చేస్తున్నారు. అటు దేవీశ్రీ కంపోజ్ చేసిన పాటలకు సూపర్ రెస్పాన్ దక్కింది. చిన్న చిన్న టీజర్స్ నుంచి లేటెస్ట్ ట్రైలర్ వరకు శర్వా సినిమాకు రిలీజ్ ముందే మంచి మార్కులు పడుతున్నాయి.
Aadavallu Meeku Johaarlu: కలిసొచ్చిన కామెడీనే నమ్ముకున్న శర్వా.. హిట్ కొట్టేనా?
ఆడవాళ్లు మూవీకి ముందు శర్వాకు ఫ్లాప్స్ ఉన్నా.. రష్మికా ఫుల్ క్రేజ్ మీదుంది. ఇప్పుడామే ఈ ప్రాజెక్ట్ కు మేజర్ సెల్లింగ్ పాయింట్. ఇక శర్వా సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకముంటుంది. కిషోర్ తిరుమల డైరెక్షన్ పై కూడా ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంది. రాధిక, కుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్ హీరోయిన్స్ కీ రోల్స్ లో నటించారు. ఇలా సో కాల్డ్ మూవ్ మెంట్స్ తో రాబోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు ఎవరికి ఎలాంటి రిజల్డ్ ఇస్తుందో చూడాలి.