Aadavallu Meeku Johaarlu: కలిసొచ్చిన కామెడీనే నమ్ముకున్న శర్వా.. హిట్ కొట్టేనా?

శర్వానంద్.. వెయిట్ చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఒకే ఒక్కహిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. వర్కవుట్ అవ్వడం లేదు. ఎన్ని కొత్త స్టోరీలు..

Aadavallu Meeku Johaarlu: కలిసొచ్చిన కామెడీనే నమ్ముకున్న శర్వా.. హిట్ కొట్టేనా?

Aadavallu Meeku Joharlu Teaser

Aadavallu Meeku Johaarlu: శర్వానంద్.. వెయిట్ చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఒకే ఒక్కహిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. వర్కవుట్ అవ్వడం లేదు. ఎన్ని కొత్త స్టోరీలు ప్రేక్షకుల ముందుకు తెచ్చినా.. హిట్ అవుతుందని ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నా.. ఎక్కడో బోల్తా పడుతున్నారు. అందుకే తన కెరీర్ కి మంచి మైలేజ్ ఇచ్చిన కామెడీ ఫార్ములానే నమ్ముకుని ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

Aadavallu Meeku Johaarlu: తానో లేడీ పవన్ కళ్యాణ్.. సాయిపల్లవిపై సుకుమార్ కామెంట్స్!

శర్వానంద్.. హీరోగానేకాదు.. మంచి పర్ ఫామర్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. ఇంత యాక్టింగ్ స్కిల్ ఉన్న ఏ హీరో అయినా.. ఇప్పటికి స్టార్ హీరో రేంజ్ కి వెళ్లాలి. ఎక్కడికో వెళ్తాడనుకున్న శర్వానంద్ సరైన సక్సెస్ లు లేక వరస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ ఫ్లాప్స్ కి చెక్ పెట్టే సాలిడ్ సినిమాతో వస్తున్నారు శర్వా.

Aadavallu Meeku Johaarlu: ఆడవారిపై ధీమాతో శర్వా.. కలిసొచ్చిన జానర్ హిట్ ఇస్తుందా?

శర్వానంద్ ఈ మధ్య వరసగా రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం లాంటి సీరియస్ సబ్జెక్ట్స్ చేశారు. దాంతో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేక వరసగా ఫ్లాపులు ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ ఫ్లాపులకి బ్రేక్ వెయ్యడానికి సూపర్ కామెడీ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. సక్సెస్ స్ట్రీమ్ లోకి రావడానికి ట్రై చేస్తున్న శర్వా.. ఆడవాళ్లూ మీకు జోహార్లు అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ తో మార్చి 4న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.

Aadavallu Meeku Joharlu: టైటిల్ సాంగ్ రిలీజ్.. దేవిశ్రీ మార్క్ కిర్రాక్ అంతే!

శర్వానంద్ తనకు బాగాకలొసొచ్చిన కెరీర్ కి మంచి మైలేజ్ ఇచ్చిన కామెడీ జానర్ ని చాలా కాలం తర్వాత చేస్తున్నారు. ఈమధ్య సినిమాలన్నీ సీరియస్ గానే ఉండడంతో ఆ ఫ్లో నుంచి బయటికి రావడానికి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ చేస్తున్నారు. పెళ్లి చేస్కోడానికి నానా ఇబ్బందులు పడుతూ.. తనను పెళ్ళి చేస్కోనివ్వకుండా చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ కి మధ్య జరిగే ఇంట్రస్టింగ్ కామెడీతో సినిమా తెరకెక్కింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో యాజ్ యూజువల్ గా తన పర్ఫామెన్స్ తో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు శర్వా.

Adavallu Meeku Joharlu: థర్డ్ సింగిల్.. సూపర్బ్ బ్యూటిఫుల్ మెలోడీ!

అసలు శర్వానంద్ కి కెరీర్ లో పెద్ద బ్రేక్ ఇచ్చింది రన్ రాజా రన్. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో వచ్చిన రన్ రాజా రన్ అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. క్రేజీ కామెడీ తో రోలర్ కోస్టర్ రైడ్ లా ఉండే ఈ స్మాల్ బడ్జెట్ మూవీ బిగ్ సక్సెస్ తో శర్వానంద్ కి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. అసలు కామెడీలో శర్వా టైమింగే వేరు. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు లాంటి ఎమోషనల్ స్టోరీ తర్వాత తనకున్న ఇమేజ్ ని చేంజ్ చేస్కోడానికి మరో కామెడీ ఎంటర్ టైనర్ చేశారు శర్వా. ఎక్స్ ప్రెస్ రాజా అనే కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ జానర్ లో చేసిన సినిమా శర్వా.. మరోసారి ఈ సినిమా హిట్ తో తన కెరీర్ ని ఎక్స్ టెండ్ చేసుకున్నారు.

Aadavallu Meeku Joharlu Teaser: కోపం.. బాధ.. టెన్షన్.. ఫ్రస్టేషన్.. ఇరిటేషన్ చూపించే శర్వా!

2016లో వచ్చిన ఎక్స్ ప్రెస్ రాజా తర్వాత అంతకుమించి కామెడీని చూపించారు మహానుభావుడు సినిమాలో. అసలే కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిన మారుతి.. కామెడీలో ఇప్పటికే మాస్టర్స్ చేసిన శర్వా కాంబినేషన్ లో తెరకెక్కిన మహానుభావుడు సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ తో పాటు కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. ఓసీడీ ఉన్న క్యారెక్టర్ లో శర్వా చేసిన కామెడీకి ధియేటర్లో హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది.

Aadavallu Meeku Johaarlu : థియేటర్లలో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’..

మహానుభావుడు తర్వాత దాదాపు 5 ఏళ్ల నుంచి శర్వా అన్నీ సీరియస్ సబ్జెక్టే చేశారు. ఆ సినిమాల్లో ఏదీ చెప్పుకోదగ్గ హిట్ కాలేదు. అందుకే ఈ సారి తన సక్సెస్ స్ట్రీమ్ లోకి రావడానికి తనకు బాగా కలిసొచ్చిన కామెడీ తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నారు. భారీ సీనియర్ స్టార్ కాస్ట్ తో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమాతో మరో హిట్ కొడతానంటున్నారు శర్వా.