Aadavallu Meeku Johaarlu : థియేటర్లలో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’..

శర్వానంద్ – రష్మికల ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్..

Aadavallu Meeku Johaarlu : థియేటర్లలో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’..

Aadavallu Meeku Johaarlu

Aadavallu Meeku Johaarlu: యంగ్ హీరో శర్వానంద్ – కన్నడ చిన్నది రష్మిక మందన్న జంటగా.. హిట్ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’..

Oke Oka Jeevitham : ‘అమ్మా.. నే కొలిచే శారదవే.. నిత్యం నను నడిపే సారథివే’.. సిరివెన్నెలకే సాధ్యం..

సీనియర్ నటీమణులు రాధిక శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు కావడంతో ఈ సినిమా మీద అంచనాలున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Radikaa Sarathkumar : రష్మికతో రాధిక సందడి.. వీడియో వైరల్..

శుక్రవారం ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 25న ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి కెమెరా : సుజిత్ సారంగ్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : పీటర్ హెయిన్.

Allu Arjun : అరుదైన ఘనత సాధించిన ‘ఐకాన్ స్టార్’!