Allu Arjun : అరుదైన ఘనత సాధించిన ‘ఐకాన్ స్టార్’!

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌.. తక్కువ టైంలో, సౌత్ ఇండస్ట్రీలో రేర్ ఫీట్ సాధించిన ఫస్ట్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు..

Allu Arjun : అరుదైన ఘనత సాధించిన ‘ఐకాన్ స్టార్’!

Allu Arjun

Allu Arjun: ‘పుష్ప’ (ది రైజ్ – పార్ట్-1) తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసాడు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌. తెలుగుతో పాటు మలయాళంలోనూ ఫ్యాన్ బేస్ ఉన్న బన్నీ ఈ సినిమాతో బాలీవుడ్‌లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడు. నార్త్‌లో ‘పుష్ప’ కోట్లాది రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చ్యరానికి గురిచేసింది. 2021లో హయ్యస్ట్ గ్రాస్ రాబట్టిన సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది ‘పుష్ప’.

Allu Arjun : ‘‘సౌత్ కా సుల్తాన్’’.. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..

హిందీ రైట్స్ కొన్న వ్యక్తికి ఏకంగా రూ. 50 కోట్లకు పైగానే ప్రాఫిట్ వచ్చింది. దీంతో ‘పుష్ప 2’ మీద లెక్కకు మించి అంచనాలు నెలకొన్నాయి. నార్త్‌లోనూ బన్నీకి ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేసాడు బన్నీ. సోషల్ మీడియాలో ‘ఐకాన్ స్టార్’ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఈయనకు ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు.

Ala Vaikunthapurramuloo : హిందీలో నో థియేట్రికల్ రిలీజ్.. కానీ..

రెండు వారాల క్రితం (జనవరి 14) ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 15 మిలియన్ల మార్క్ టచ్ చేసిన బన్నీ ఫాలోయర్ల సంఖ్య ఇప్పుడు 16 మిలియన్లకు చేరుకుంది. ఇంత తక్కువ టైంలో, సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో బన్నీనే కావడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగున్నర ఏళ్లలోనే 16 మిలియన్ల మంది ఫాలోయర్స్‌ని పొందారు అల్లు అర్జున్.. అలాగే ట్విట్టర్‌లో 6.4 మిలియన్ల మంది బన్నీని ఫాలో అవుతున్నారు.

Pushpa Movie : ‘పుష్ప’ ముందు హిందీ సినిమాలు తేలిపోయాయి-కరణ్ జోహర్..